T Natarajan : రోజురోజుకు ధృఢంగా తయారవుతున్నా.. టి.నటరాజన్ ఫిట్‌నెస్ వీడియో

T Natarajan : రోజురోజుకు ధృఢంగా తయారవుతున్నా.. టి.నటరాజన్ ఫిట్‌నెస్ వీడియో

T Natarajan

Updated On : May 16, 2021 / 7:24 PM IST

Indian Premier League : రోజురోజుకు ధృఢంగా తయారవుతున్నాఅంటున్నాడు..టీమిడియా ప్లేయర్ టి.నటరాజన్. ఫిట్ నెస్ కు సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఐపీఎల్ 14 సీజన్ ఆరంభంలోనే.. టి.నటరాజన్ కి మోకాలికి గాయం కావడంతో ఆ సీజన్ కు దూరమైన సంగతి తెలిసిందే.

వైద్యులు అతడిని పరీక్షించి మోకాలికి సర్జరీ నిర్వహించారు. ఇంట్లోనే విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఇంట్లోనే ఉంటూ..ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టాడు. ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియోను అతను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. నేను రోజురోజుకీ ధృఢంగా తయారవుతున్నా అంటూ క్యాప్షన్‌ జత చేశాడు. ఈ సందర్భంగా రీహాబ్‌, ప్రొగ్రెస్‌ అనే రెండు హ్యాష్‌ట్యాగ్‌లను జోడించాడు.

22 యార్డులున్న పిచ్‌పై బౌలింగ్‌ చేయడానికి త్వరలోనే వస్తానని వెల్లడించాడు. ఇప్పుడు మోకాలి సర్జరీ సక్సెస్ అయ్యిందని తెలిపిన ఈ క్రికేటర్ అందరి ఆశీర్వాద బలంతో త్వరగా కోలుకుంటున్నట్లు తెలిపాడు. తనపై అభిమానానికి, ఆదరణకు.. అలాగే కష్టకాలంలో మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు అంటూ వెల్లడించాడు.

యార్కర్లు వేయడంలో ఇతను స్పెషలిస్టు. ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఇతను అద్బుత ప్రదర్శన కనబరిచాడు. ఆసీస్‌ పర్యటనలో తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఆఖరి టెస్టు మ్యాచ్‌లో మూడు వికెట్లు తీశాడు నటరాజన్.

Read More : Railway Stations దేశంలోని 6వేల రైల్వే స్టేషన్లలో ఉచిత వై-ఫై