T20 World Cup 2021 : రాణించిన ఇంగ్లాండ్ బౌలర్లు.. టార్గెట్ 126

టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది.

T20 World Cup 2021 : రాణించిన ఇంగ్లాండ్ బౌలర్లు.. టార్గెట్ 126

T20 World Cup 2021 England Target

Updated On : October 30, 2021 / 9:48 PM IST

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బౌలింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ బౌలర్లు విజృంభించారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. దీంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఇంగ్లాండ్ ముందు 126 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్(49 బంతుల్లో 44 పరుగులు) ఒక్కడే రాణించాడు.

Covid-19 Origins : కొవిడ్ పుట్టుక.. వైరస్ మూలాలను ఎప్పటికీ గుర్తించ‌లేం.. జీవాయుధం కానేకాదు!

అగర్(20), వేడ్(18), కమిన్స్(12), మిచెల్ స్టార్క్(13) పర్లేదనిపించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు తీశాడు. వోక్స్ రెండు వికెట్లు తీశాడు. మిల్స్ రెండు వికెట్లు తీశాడు. రషీద్, లివింగ్ స్టన్ తలో వికెట్ తీశారు. 20 ఓవర్లలో 125 పరుగులకు ఆసీస్ ఆలౌట్ అయ్యింది.

Disease Attack : యువతపై జబ్బుల దాడి… చిన్న వయస్సులోనే మరణం అంచులకు..

ఇంగ్లండ్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో భారీ స్కోరు సాధించాలన్న ఆసీస్ ఆశలు నెరవేరలేదు. ఆసీస్ లైనప్ లో చివరి వరుస బ్యాట్స్ మెన్ సిక్సర్లు కొట్టడంతో ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. అగర్ రెండు సిక్సులు, కమిన్స్ రెండు సిక్సులు, స్టార్క్ ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టారు. వార్నర్ (1) విఫలం కాగా, స్టీవెన్ స్మిత్ (1), మ్యాక్స్ వెల్ (6), స్టొయినిస్ (0) నిరాశపరిచారు. ఆసీస్‌ ఆఖరి నాలుగు ఓవర్లలో 50 పరుగులు రాబట్టింది. దీంతో ఇంగ్లాండ్ ముందు మోస్తరు లక్ష్యాన్ని ఉంచగలిగింది.