T20 World Cup 2021 : దంచికొట్టిన డస్సెన్.. ఇంగ్లాండ్ ముందు భారీ టార్గెట్
టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత

T20 World Cup 2021 England Target
T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్ 12లో భాగంగా ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఇంగ్లాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇంగ్లాండ్ ముందు 190 పరుగుల బిగ్ టార్గెట్ ఉంచింది.
Obesity medicine : ఊబకాయం తగ్గించే ఇంజెక్షన్..ఎగబడుతున్న జనాలు..
సౌతాఫ్రికా బ్యాటర్లలో వ్యాన్ డర్ డస్సెన్, మార్ క్రమ్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ముఖ్యంగా వాండర్ డస్సెన్ విధ్వంసం సృష్టించాడు. 60 బంతుల్లో 94 పరుగులు (నాటౌట్) చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 6 సిక్సులు, 5 ఫోర్లు ఉన్నాయి. మరో బ్యాటర్ ఐడెన్ మార్ క్రమ్ 25 బంతుల్లో 52 పరుగులతో (నాటౌట్) రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో మోయిన్ అలీ, అదిల్ రషీద్ తలో వికెట్ తీశారు.
Ladyfinger : రక్త సరఫరా మెరుగు పరిచి…శ్వాసకోశ సమస్యల్ని దూరం చేసే బెండకాయ
సూపర్-12 దశలో 4 మ్యాచ్ లు ఆడి 3 విజయాలతో కొనసాగుతున్న దక్షిణాఫ్రికాకు కూడా సెమీస్ అవకాశాలు ఉన్నాయి. అయితే నేటి మ్యాచ్ లో ఇంగ్లండ్ పై భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా ఓటమిపాలైనా, సాధారణ విజయం సాధించినా… మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఆస్ట్రేలియా సెమీస్ లో అడుగుపెడుతుంది.