T20 World Cup 2021 చెలరేగిన పాకిస్తాన్.. నమీబియా ముందు భారీ టార్గెట్

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్, నమీబియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ బ్యాటర్లు చెలరేగిపోయారు. నిర్ణీత ఓవర్లలో

T20 World Cup 2021 చెలరేగిన పాకిస్తాన్.. నమీబియా ముందు భారీ టార్గెట్

T20 World Cup 2021 Pakistan

Updated On : November 2, 2021 / 9:28 PM IST

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్, నమీబియా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ బ్యాటర్లు చెలరేగిపోయారు. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోర్ చేసింది.

పాక్ ఓపెనర్లు రిజ్వాన్(50 బంతుల్లో 79), బాబర్ ఆజమ్(49 బంతుల్లో 70) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. మహమ్మద్ హఫీజ్ 32 పరుగులు చేశాడు. నమీబియా బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. నమీబియా బౌలర్లలో డేవిడ్ వీస్, జాన్ తలో వికెట్ తీశారు.

WhatsApp Cashback: వాట్సాప్‌ పేమెంట్స్‌తో క్యాష్‌బ్యాక్‌.. ఇలా ట్రై చేయండి!

యూఏఈ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు అంచనాలకు మించి రాణిస్తోంది. సూపర్-12 దశలో గ్రూప్-2లో ఇప్పటిదాకా తాను ఆడిన 3 మ్యాచ్ లలోనూ నెగ్గింది. నమీబియాతో పోరులోనూ గెలిస్తే పాక్ జట్టుకు సెమీఫైనల్ బెర్తు ఖరారవుతుంది. పాక్ జట్టు ప్రస్తుతం ఉన్న ఫామ్ దృష్ట్యా విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు.