T20 World Cup 2021 : మొయిన్ అలీ హాఫ్ సెంచరీ, న్యూజిలాండ్ టార్గెట్ 167
టీ20 వరల్డ్ కప్ తొలి సెమీస్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్

T20 World Cup 2021 New Zealand Target
T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ తొలి సెమీస్ లో భాగంగా ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. టాస్ నెగ్గిన న్యూజిలాండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో మొయిన్ అలీ హాఫ్ సెంచరీతో (37 బంతుల్లో 51 పరుగులు) అదరగొట్టాడు. డేవిడ్ మలన్(41), జోస్ బట్లర్ (29) రాణించారు. కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ, ఆడమ్ మిల్నే, ఇష్ సోధీ, జేమ్స్ నీషమ్ తలో వికెట్ తీశారు.
2016 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో, 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఇంగ్లాండ్ గెలిచింది. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో కివీస్ పైచేయి సాధిస్తుందా… ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందా లేదా చూడాలి.
OnePlus Nord 2 : మళ్లీ పేలిన వన్‌ప్లస్ నోర్డ్ 2 ఫోన్.. యూజర్‌కు తీవ్రగాయాలు.. ఫొటోలు వైరల్!
టీ20 ప్రపంచకప్‌లో అసలు సిసలు సమరానికి వేళైంది. నాకౌట్ పోరాటాలకు తెరలేచింది. బుధవారం తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో న్యూజిలాండ్ తలపడుతోంది. టైటిల్ ఫేవరేట్‌గా టోర్నీలో అడుగుపెట్టిన ఇంగ్లాండ్.. అంచనాలు నిలబెట్టుకుంటూ సాగుతోంది. గ్రూప్-1లో ఆడిన 5 మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఓ ఓటమితో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది.
Heart Disease : చలికాలంలోనే గుండె జబ్బులు అధికం ఎందుకంటే?..
మరోవైపు నిలకడగా రాణిస్తున్న కివీస్ సైతం అటు గ్రూప్- 2లో 5 మ్యాచ్‌ల్లో నాలుగింట్లో గెలిచి.. ఒక దాంట్లో ఓడి రెండో స్థానంతో ముందంజ వేసింది. ఇప్పటికే ఓ సారి పొట్టి కప్పు (2010)ను ఖాతాలో వేసుకున్న ఇంగ్లాండ్.. రెండో టైటిల్ అందుకోవాలంటే కివీస్ గండాన్ని దాటాల్సి ఉంది. ఇక తొలిసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్లో అడుగు పెట్టాలంటే న్యూజిలాండ్ శక్తికి మించి శ్రమించక తప్పదు.