T20 World Cup 2021 : వెస్టిండీస్ పై సౌతాఫ్రికా విజయం

టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఈ పోరులో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో సునాయసంగా నెగ్గింది. తొలుత కరీబియన్లను 143 పరుగులకే పరిమితం

T20 World Cup 2021 : వెస్టిండీస్ పై సౌతాఫ్రికా విజయం

T20 World Cup 2021

Updated On : October 26, 2021 / 10:31 PM IST

T20 World Cup 2021 : టీ20 వరల్డ్ కప్ సూపర్-12 దశలో భాగంగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు తలపడ్డాయి. ఈ పోరులో దక్షిణాఫ్రికా 8 వికెట్ల తేడాతో సునాయసంగా నెగ్గింది. తొలుత కరీబియన్లను 143 పరుగులకే పరిమితం చేసిన సఫారీలు… ఆపై 18.2 ఓవర్లలో లక్ష్యాన్ని అందుకున్నారు.

PF Balance : మీ పీఎఫ్‌ బ్యాలెన్స్ ఇప్పుడు సులభంగా తెలుసుకోవచ్చు..!

ఐడెన్ మార్ క్రమ్ హాఫ్ సెంచరీ (26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు) చేసి దక్షిణాఫ్రికా విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. మరో ఎండ్ లో వాన్ డుర్ డుస్సెన్ 43 పరుగులతో రాణించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే కెప్టెన్ టెంబా బవుమా 2 పరుగులు చేసి అవుట్ కాగా, మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 39 పరుగులు చేశాడు. విండీస్ బౌలర్లలో అకీల్ హోసీన్ ఒక వికెట్ తీశాడు.

విండీస్‌ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలోనే ఛేదించింది. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన విండీస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. విండీస్‌ తొలి మూడు ఓవర్లలో ఆరు పరుగులే చేసింది. నాలుగో ఓవర్‌ నుంచి గేర్ మార్చిన ఎవిన్‌ లూయిస్ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

Petrol : లీటర్ కేవలం రూ.1.50.. ఆ దేశంలో అగ్గిపెట్టె కంటే పెట్రోల్ చీప్

మరో ఓపెనర్ లెండిల్‌ సిమ్మన్స్‌ (16) నెమ్మదిగా ఆడుతూ అతడికి సహకరించాడు. హాఫ్ సెంచరీ తర్వాత లూయిస్‌ కేశవ్‌ మహరాజ్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నికోలస్‌ పూరన్ (12) దూకుడుగా ఆడే క్రమంలో డేవిడ్ మిల్లర్‌కి చిక్కాడు. రబాడ వేసిన 14వ ఓవర్లో సిమ్మన్స్ బౌల్డై మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.

క్రిస్ గేల్ (12), షిమ్రోన్ హెట్‌మైర్‌ (1), ఆండ్రూ రస్సెల్ (5), హేడెన్‌ వాల్ష్‌ (0) విఫలమయ్యారు. ఆఖర్లో వచ్చిన పొలార్డ్‌ (26) పరుగులు చేశాడు. డ్వేన్‌ బ్రావో (8), అకీల్ హోసీన్‌ (0) నాటౌట్‌గా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో డ్వేయిన్‌ ప్రిటోరియస్‌ 3, కేశవ్‌ మహరాజ్‌ 2 వికెట్లు తీశారు. కగిసో రబాడ, అన్రిచ్‌ నోర్జే చెరో వికెట్ తీశారు.

స్కోర్లు..
వెస్టిండీస్ – 143/8
సౌతాఫ్రికా – 144/2(18.2 ఓవర్లు)