T20 World Cup 2021: ‘విరాట్ కోహ్లీని కచ్చితంగా బాధపడేలా చేస్తాం’

టీ20 వరల్డ్ కప్ 2021 ఈవెంట్‌లో గ్రూప్ బీ రౌండ్ 1 క్వాలిఫైయింగ్ దశ పూర్తయింది. బంగ్లాదేశ్ పై విజయంతో మొదలుపెట్టి న్యూ గినాయా, ఒమన్ లపైనా విజయకేతనం ఎగరేసింది.

T20 World Cup 2021: టీ20 వరల్డ్ కప్ 2021 ఈవెంట్‌లో గ్రూప్ బీ రౌండ్ 1 క్వాలిఫైయింగ్ దశ పూర్తయింది. బంగ్లాదేశ్ పై విజయంతో మొదలుపెట్టి న్యూ గినాయా, ఒమన్ లపైనా విజయకేతనం ఎగరేసింది. చివరిసారిగా ఒమన్ పై గెలిచిన తర్వాత స్కాట్లాండ్ టీం లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మార్క్ వాట్ మూడు వికెట్లు పడగొట్టి.. తన దగ్గర కోహ్లీని చిత్తుచేయడానికి కూడా ప్లాన్లు ఉన్నాయని అంటుున్నాడు.

నవంబర్ 5న స్కాట్లాండ్ తో ఆడాల్సిన.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి తిప్పలు తప్పవని హెచ్చరిస్తున్నాడు. ‘విరాట్ కోసం నా దగ్గర కొన్ని ప్లాన్లు ఉన్నాయి. వాళ్లు బెదిరిపోయి బాధపడేలా చేస్తా’ అని ఐసీసీ మీడియాతో చెప్పాడు.

‘దీనికి అర్థం పెద్ద స్టార్లతో ఆడేటప్పుడు గేమ్ అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోవాలి. ప్రపంచంలోనే వాళ్లు ది బెస్ట్ కావొచ్చు. మొత్తం ప్రపంచానికి స్కిల్స్ చూపించాల్సి వచ్చినప్పుడు.. బెస్ట్ టీమ్స్, బెస్ట్ ప్లేయర్లతో తలపడేముందు మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోవాలి’ అని వాట్ వెల్లడించాడు.

………………………………………….: ప్రభాస్ బర్త్ డే.. మనసులో మాట బయటపెట్టిన అనుష్క..!

టీమిండియా తన తొలి మ్యాచ్ అక్టోబర్ 24న పాకిస్తాన్ తో తలపడనుండగా.. 4వ మ్యాచ్ ను స్కాట్లాండ్ తో నవంబర్ 5న ఆడుతుంది.

ట్రెండింగ్ వార్తలు