IND vs IRE : టీ20 వరల్డ్ కప్.. భారత్ బోణీ.. ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం

టీ20 ప్రపంచకప్ 2024లో భారత్ ఘనంగా శుభారంభం చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది.

IND vs IRE : టీ20 వరల్డ్ కప్.. భారత్ బోణీ.. ఐర్లాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం

T20 World Cup 2024 Live Cricket ( image Credit : @T20WorldCup/twitter )

Updated On : June 5, 2024 / 11:06 PM IST

India vs Ireland : టీ20 ప్రపంచ కప్ 2024లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా శుభారంభం చేసింది. ఐర్లాండ్ నిర్దేశించిన 97 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ 12.2 ఓవర్లలో 2 వికెట్ల నష్టపోయి ఇంకా 46 బంతులు మిగిలి ఉండగానే ఛేదించి ఘన విజయాన్ని సాధించింది. టీమిండియా ఓపెనర్లలో విరాట్ కోహ్లీ (1) పరుగుకే చేతులేత్తేయగా, మరో ఓపెనర్ కెప్టెన్, రోహిత్ శర్మ (52; 37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్)తో హాఫ్ సెంచరీతో రాణించాడు.

రోహిత్ భుజం గాయంతో రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. హిట్ మ్యాన్ స్థానంలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (2) పరుగులకే నిష్ర్కమించాడు. బెంజిమన్ వైట్ వేసిన 11.4 ఓవర్‌కు డాక్రెల్‌కు క్యాచ్ ఇచ్చి సూర్యకుమార్ పెవిలియన్ చేరాడు. కోహ్లీ స్థానంలో బరిలోకి దిగిన రిషబ్ పంత్ (36; 26 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్)తో అజేయంగా నిలిచాడు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అడైర్, బెంజిమన్ వైట్ తలో వికెట్ తీసుకున్నారు.

టీమ్ఇండియా టార్గెట్ 97
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ కుప్ప‌కూలింది. భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో 16 ఓవ‌ర్ల‌లో 96 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఐర్లాండ్ బ్యాట‌ర్ల‌లో గారెత్ డెలానీ (26) ఫ‌ర్వాలేద‌నిపించాడు. భార‌త బౌల‌ర్ల‌లో హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, జ‌స్‌ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లు తీశారు. మ‌హ్మ‌ద్ సిరాజ్‌, అక్ష‌ర్ ప‌టేల్‌లు ఒక్కొ వికెట్ సాధించారు.

జోష్ లిటిల్ క్లీన్‌బౌల్డ్‌..
జ‌స్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో జాషువా లిటిల్ (14) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 14.1వ ఓవ‌ర్‌లో 77 ప‌రుగుల వ‌ద్ద ఐర్లాండ్ తొమ్మిదో వికెట్ కోల్పోయింది.

మెక్‌కార్తీ ఔట్‌..
అక్ష‌ర్ ప‌టేట్ బౌలింగ్‌లో అత‌డే క్యాచ్ అందుకోవ‌డంతో బారీ మెక్‌కార్తీ (0) ఔట్ అయ్యాడు. దీంతో 11.1వ ఓవ‌ర్‌లో 50 ప‌రుగుల వ‌ద్ద ఐర్లాండ్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

మార్క్ అడైర్ ఔట్‌..
హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో శివ‌మ్‌దూబె క్యాచ్ అందుకోవ‌డంతో మార్క్ అడైర్ (3) ఔట్ అయ్యాడు. దీంతో 10.1వ ఓవ‌ర్‌లో 49 ప‌రుగుల వ‌ద్ద ఐర్లాండ్ ఏడో వికెట్ కోల్పోయింది.

జార్జ్ డాక్రెల్ ఔట్‌..
మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్‌లో జ‌స్‌ప్రీత్ బుమ్రా క్యాచ్ అందుకోవ‌డంతో జార్జ్ డాక్రెల్ (3) ఔట్ అయ్యాడు. దీంతో 9.4వ ఓవ‌ర్‌లో 46 ప‌రుగుల వ‌ద్ద ఐర్లాండ్ ఆరో వికెట్ కోల్పోయింది.

కర్టిస్ కాంఫర్ ఔట్‌.. 
హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో రిష‌బ్ పంత్ క్యాచ్ అందుకోవ‌డంతో కర్టిస్ కాంఫర్ (12) ఔట్ అయ్యాడు. 9 ఓవ‌ర్ల‌కు ఐర్లాండ్ స్కోరు 44/5. జార్జ్ డాక్రెల్ (1), గారెత్ డెలానీ (0) లు క్రీజులో ఉన్నారు.

హ్యారీ టెక్టర్ ఔట్‌..
ఐర్లాండ్ వ‌రుస‌గా వికెట్లు కోల్పోతుంది. జ‌స్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లి క్యాచ్ అందుకోవ‌డంతో హ్యారీ టెక్టర్ (4) ఔట్ అయ్యాడు. 8 ఓవ‌ర్ల‌కు ఐర్లాండ్ స్కోరు 36/4. కర్టిస్ కాంఫర్ (5) లు క్రీజులో ఉన్నారు.

లోర్కాన్ టక్కర్ క్లీన్‌బౌల్ట్‌.. 
ఐర్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో లోర్కాన్ టక్కర్ (10) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఐర్లాండ్ 6.5వ ఓవ‌ర్‌లో 28 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది. 7 ఓవ‌ర్ల‌కు ఐర్లాండ్ స్కోరు 32/3. హ్యారీ టెక్టర్ (1), కర్టిస్ కాంఫర్ (4) లు క్రీజులో ఉన్నారు.

ప‌వ‌ర్ ప్లే పూర్తి..
ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే పూర్తైంది. 6 ఓవ‌ర్ల‌కు ఐర్లాండ్ స్కోరు 26/2. లోర్కాన్ టక్కర్(9), హ్యారీ టెక్టర్ (1) లు క్రీజులో ఉన్నారు.

ఆండ్రూ బల్బిర్నీ క్లీన్ బౌల్డ్..
ఐర్లాండ్ మ‌రో వికెట్ కోల్పోయింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో ఆండ్రూ బల్బిర్నీ(5) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఐర్లాండ్ 2.6వ ఓవ‌ర్‌లో 9 ప‌రుగుల వ‌ద్ద రెండో వికెట్ కోల్పోయింది. 3 ఓవ‌ర్ల‌కు ఐర్లాండ్ స్కోరు 9/2. లోర్కాన్ టక్కర్(1), హ్యారీ టెక్టర్ (0) లు క్రీజులో ఉన్నారు.

పాల్ స్టిర్లింగ్ ఔట్‌..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌కు షాక్ త‌గిలింది. అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో రిష‌బ్ పంత్ క్యాచ్ అందుకోవ‌డంతో ఓపెన‌ర్ పాల్ స్టిర్లింగ్ (2) ఔట్ అయ్యాడు. దీంతో ఐర్లాండ్ 2.1వ ఓవ‌ర్‌లో 7 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది. లోర్కాన్ టక్కర్ (0), ఆండ్రూ బల్బిర్నీ (0) లు క్రీజులో ఉన్నారు.

ఐర్లాండ్ తుది జ‌ట్టు : పాల్ స్టిర్లింగ్(కెప్టెన్‌), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(వికెట్ కీప‌ర్‌), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్‌కార్తీ, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్

భారత తుది జ‌ట్టు : రోహిత్ శర్మ(కెప్టెన్‌), విరాట్ కోహ్లి, రిషబ్ పంత్(వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జ‌స్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్

India vs Ireland : న్యూయార్క్‌లోని నాసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్‌, ఐర్లాండ్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించి పొట్టి ప్ర‌పంచ‌కప్‌లో ఘ‌నంగా బోణీ కొట్టాల‌ని భార‌త్ భావిస్తుండ‌గా.. టీమ్ఇండియాకు షాక్ ఇవ్వాల‌ని ఐర్లాండ్ ప‌ట్టుదల‌గా ఉంది. కాగా.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఐర్లాండ్ మొద‌ట బౌలింగ్ చేయ‌నుంది.