T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం బంగ్లాదేశ్ జ‌ట్టు ఇదే.. ముస్తాఫిజుర్ కు చోటు..

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం (T20 World Cup 2026) బంగ్లాదేశ్ త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది.

T20 World Cup 2026 : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ కోసం బంగ్లాదేశ్ జ‌ట్టు ఇదే.. ముస్తాఫిజుర్ కు చోటు..

T20 World Cup 2026 BCB announces Bangladesh Squad

Updated On : January 4, 2026 / 2:24 PM IST
  • టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌కు బంగ్లాదేశ్ జ‌ట్టు ప్ర‌క‌ట‌న‌
  • లిట‌న్ సార‌థ్యంలోనే మెగాటోర్నీలో బ‌రిలోకి
  • ముస్తాఫిజుర్ రెహ‌మాన్‌కు చోటు

T20 World Cup 2026 : భార‌త్, శ్రీలంక దేశాలు టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026కి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఈ మెగా టోర్నీ ఫిబ్ర‌వ‌రి 7 నుంచి మార్చి 8 వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే దేశాల క్రికెట్ బోర్డులు త‌మ త‌మ జ‌ట్ల‌ను ప్ర‌క‌టిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు త‌మ జ‌ట్టును ప్ర‌క‌టించింది. లిట‌న్ దాస్ సార‌థ్యంలోనే బంగ్లాదేశ్ ఈ మెగాటోర్నీలో బ‌రిలోకి దిగ‌నుంది.

15 మంది స‌భ్యుల‌తో కూడిన బృందంలో త‌స్కిన్ అహ్మ‌ద్, ముస్తాఫిజుర్ రెహ‌మాన్, రిషాద్ హోస్సేన్‌లు చోటు ద‌క్కించుకున్నారు.

KKR : ముస్తాఫిజుర్ స్థానంలో రానున్న ఆ డేంజరస్ బౌల‌ర్ ఎవ‌రు? ఓ ముగ్గురిపై కన్నేసిన కేకేఆర్..!

ముస్తాఫిజుర్, తస్కిన్ అహ్మద్ పేస్ బాధ్యతలు మోయ‌నుండ‌గా, మెహదీ హసన్, రిషాద్ హొస్సేన్‌లు స్పిన్ బాధ్య‌త‌లు పంచుకోనున్నారు. లిటన్ దాస్, తంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ లు బ్యాటింగ్‌లో కీల‌క పాత్ర పోషించే ఛాన్స్ ఉంది.


ఇంగ్లాండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీలతో పాటు బంగ్లాదేశ్ గ్రూప్ సిలో ఉంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఫిబ్రవరి 7న వెస్టిండీస్‌, 9న ఇటలీ, 14న ఇంగ్లాండ్‌, 17న వాంఖడేలో నేపాల్‌తో బంగ్లాదేశ్ మ్యాచ్‌లు ఆడ‌నుంది.

AUS vs ENG : ఇంగ్లాండ్ జోరును అడ్డుకున్న వ‌రుణుడు.. ముగిసిన తొలి రోజు ఆట‌

ఇటీవ‌ల ఉద్రిక్త‌తల నేప‌థ్యంలో ముస్తాఫిజుర్ రెహమాన్ ను ఐపీఎల్ నుంచి విడుద‌ల చేశారు. ఈ క్ర‌మంలో భార‌త్‌లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ మ్యాచ్‌ల‌ను ఆడ‌బోమ‌ని బంగ్లాదేశ్ ఐసీసీ తెలియ‌జేయాల‌ని భావిస్తోంది.

2026 టీ20 ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్‌ జట్టు ఇదే..
లిట‌న్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మెహదీ హసన్, రిషద్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహమన్, తాంజిమ్ హసన్ సాకిబ్, తస్కిన్ అహ్మద్, షైఫ్ ఉద్దీన్, షోరిఫుల్ ఇస్లాం.