T20 World Cup 2021: టిక్కెట్ లేకుండా స్టేడియాలకు వస్తున్న అభిమానులపై ఐసీసీ ఫైర్

టిక్కెట్లు లేకుండా స్టేడియాల్లోకి వచ్చి ఘర్షణకు దిగిన అభిమానులపై ఇన్వెస్టిగేషన్ చేయాలని ఐసీసీ ఆదేశించింది. ఈ మేరకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు త్వరితగతిన స్పందించి ...

Pak Afg

T20 World Cup 2021: టిక్కెట్లు లేకుండా స్టేడియాల్లోకి వచ్చి ఘర్షణకు దిగిన అభిమానులపై ఇన్వెస్టిగేషన్ చేయాలని ఐసీసీ ఆదేశించింది. ఈ మేరకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు త్వరితగతిన స్పందించి వేల మంది పాల్గొన్న ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వాలని అడిగింది. టీ20 వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా దుబాయ్ స్టేడియంలో అఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది.

మ్యాచ్ కోసం 16వేల టిక్కెట్లు విక్రయించారు స్టేడియం నిర్వాహకులు. వేలమంది టిక్కెట్లు లేని వారంతా స్టేడియంకు వచ్చేసి బలవంతంగా స్టేడియంలోకి చొరబడ్డారు. ‘అఫ్ఘన్ అభిమానులు టిక్కెట్ కొనుక్కొని స్టేడియంలోకి రావాలని.. ఇది రిపీట్ చేయొద్దని.. కరెక్ట్ కాదని’ నబీ చెప్పాడు.

అధికారులు దీనిపై ఫోకస్ పెట్టి అసలేం జరిగిందో చెప్పాలని.. మళ్లీ ఫ్యూచర్ లో రిపీట్ కాకుండా ఉండాలని ఐసీసీ చెప్పింది. టిక్కెట్లు లేకుండా చొరబడటం కారణంగా టిక్కెట్లు ఉన్న వారు స్టేడియం బయటే ఆగిపోయారు. వారంతో నవంబర్ 14న జరిగే ఫైనల్ మ్యాచ్ కు రావొచ్చని ఐసీసీ చెప్పింది.

………………….,.: నికిత శర్మ లేటెస్ట్ పిక్స్

ఐసీసీ, బీసీసీఐ, ఈసీబీలు క్షమాపణలు చెప్తున్నారని.. స్టేడియంలో ఈ మ్యాచ్ చూడటానికి వెళ్లలేని వారంతా టిక్కెట్ ప్రొవైడర్లని కలవాలని సూచించారు.