T20 World Cup : పాక్ జట్టే ఫెవరేట్…ఫైనల్ చేరేది అదే – రాబిన్ ఊతప్ప

ఇంగ్లండ్ జట్టును ఓడించి..న్యూజిలాండ్ టీం ఫైనల్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్, పాక్ లలో ఏ జట్టు ఫైనల్ లో అడుగు పెడుతుందనే ఉత్కంఠ నెలకొంది.

T20 World Cup : పాక్ జట్టే ఫెవరేట్…ఫైనల్ చేరేది అదే – రాబిన్ ఊతప్ప

T20 World Cup

Updated On : November 11, 2021 / 11:13 AM IST

Robin Uthappa : టీ 20 ప్రపంచ కప్ లాస్ట్ స్టేజ్ కు చేరుకుంది. ఫైనల్ లోకి వెళ్లేందుకు..ఆస్ట్రేలియా – పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ క్రమంలో..ఏ జట్టు ఫైనల్ కు వెళ్లనుందో…టీమిండియా సీనియర్ ఆటగాడు రాబిన్ ఊతప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. పాక్ జట్టు ఫైనల్ చేరుతుందని జోస్యం చెప్పారు. దీనికి కారణం కూడా చెప్పారాయన. ప్రపంచ కప్ పోటీల్లో ఆసీస్, పాక్ జట్లు బాగా ఆడుతున్నాయని..అయితే…అన్ని మ్యాచ్ ల్లో పాక్ గెలిచి ముందుకు సాగుతోందన్నారు. అందుకే ఆ జట్టు ఫెవరేట్ గా బరిలోకి దిగుతుందన్నారు.

Read More : Earthquake in Indonesia : ఇండోనేషియాలో భూకంపం..రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదు

ఇప్పటికే ఇంగ్లండ్ జట్టును ఓడించి..న్యూజిలాండ్ టీం ఫైనల్ కు చేరుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్, పాక్ లలో ఏ జట్టు ఫైనల్ లో అడుగు పెడుతుందనే ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం పాక్ జట్టు విషయానికి వస్తే..టీ 20 ప్రపంచకప్ లో ఈ ఒక్కజట్టే…అజేయంగా రాణిస్తోందనే విషయాన్ని రాబిన్ ఊతప్ప వెల్లడించారు. అదే జోరును కంటిన్యూ చేస్తే..విజయం సాధించడం కష్టం కాదని.. అభిప్రాయం వ్యక్తం చేశారు. మరోవైపు ఆసీస్ జట్టు క్రీడాకారులు కూడ రాణిస్తుండడంతో..మ్యాచ్ హోరాహోరీగా కొనసాగే అవకాశం ఉందన్నారు.

Read More : Gold Rate : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ప్రధాన నగరాల్లో రేట్లు ఇలా

ఎంతటి బలమైన జట్టును కూడ ఓడించే శక్తి ఈ టీంకు ఉందన్న రాబిన్ అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో బలంగా కనిపిస్తోందని తెలిపారు. ఆసీస్ ఓపెనర్లు మంచి ఫామ్ లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశమన్నారు. టీ 20 ప్రపంచకప్ లో రెండు సార్లు పాక్ జట్టు ఫైనల్ లో అడుగు పెట్టింది. 2009లో ఛాంపియన్ గా నిలిచింది. ఐదుసార్లు వన్డే ప్రపంచకప్ విజేతగా ఆసీస్ నిలవగా..టీ 20 మ్యాచ్ ఫైనల్ లో మాత్రం విజేతగా నిలువలేకపోయింది. మరి రాబిన్ ఊతప్ప చెప్పినట్లు జరుగుతుందా ? లేదా ? అనేది చూడాలి.

Koo App

Can’t wait for the two super exciting semis coming up!

#t20worldcup #EngVsNZ #PakVsAus #semifinals #sabsebadastadium

Robin Uthappa (@robinuthappa) 10 Nov 2021