ఆస్ట్రేలియా జట్టుకు బిగ్‌షాక్‌.. అలా జరిగితే సెమీస్ ఆశలు గల్లంతేనా?

ఆస్ట్రేలియాను రెండు భయాలు వెంటాడుతున్నాయి. భారత్ జట్టు ప్రస్తుతం భీకర ఫాంలో ఉంది. ఎలాంటి క్లిష్టపరిస్థితులనైనా ..

ఆస్ట్రేలియా జట్టుకు బిగ్‌షాక్‌.. అలా జరిగితే సెమీస్ ఆశలు గల్లంతేనా?

India vs Australia Match

T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీలో బిగ్ మ్యాచ్ కు సమయం ఆసన్నమైంది. సెయింట్ లూసియాలో సోమవారం రాత్రి 8గంటలకు ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. సెమీఫైనల్ కు చేరాలంటే ఆస్ట్రేలియా ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సి ఉంది. లేకుంటే సూపర్ -8 నుంచి ఇంటిబాట పట్టాల్సిందే. సూపర్-8 విభాగం గ్రూప్-1లో ఆస్ట్రేలియా, భారత్, అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. భారత్ జట్టు సెమీస్ బెర్త్ దాదాపుగా ఖాయమైంది. బంగ్లాదేశ్ సమీస్ రేసునుంచి తప్పుకుంది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో అఫ్గాన్ జట్టుపై ఓటమితో ఆసీస్ సెమీస్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది.

Also Read : ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి కీలక వ్యాఖ్యలు, ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే..

అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు రెండేసి మ్యాచ్ లు ఆడగా.. రెండు పాయింట్లతో సమఉజ్జీలుగా ఉన్నాయి. ఇవాళ రాత్రి 8గంటలకు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. రేపు ఉదయం అఫ్గానిస్థాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆస్ట్రేలియా, అఫ్గాన్ జట్లకు ఈ రెండు మ్యాచ్ లు చాలా కీలకం. మరోవైపు ఆస్ట్రేలియా తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆ జట్టుకు గట్టిషాకిచ్చేందుకు భారత్ జట్టు సిద్ధమైంది. తద్వారా గతేడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తోంది. భారత్ చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయి.. బంగ్లాపై అఫ్గాన్ విజయం సాధిస్తే ఆసీస్ జట్టు సెమీఫైనల్ అవకాశాలను కోల్పోతుంది.

Also Read : AUS vs AFG: టీ20 వరల్డ్ కప్‌లో మరో సంచలనం.. ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ జట్టు విజయం

ఆస్ట్రేలియాను రెండు భయాలు వెంటాడుతున్నాయి. భారత్ జట్టు ప్రస్తుతం భీకర ఫాంలో ఉంది. ఎలాంటి క్లిష్టపరిస్థితులనైనా తమకు అనుకూలంగా మార్చుకోగల బ్యాటర్లు, బౌలర్లు ఉన్నారు. ఈ టోర్నీలో టీమిండియా ఒక్క ఓటమినికూడా చవిచూడలేదు. దీంతో భారత్ జట్టును ఢీకొట్టి విజేతగా నిలవడం ఆసీస్ కు పెద్ద సవాలే. మరోవైపు ఆసీస్ జట్టును వరుణుడు భయంకూడా వెంటాడుతోంది. భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ సెయింట్ లూసియాలో జరుగుతుంది. అక్కడ ఉరుములతో కూడిన వర్షం పడుతుంది. మ్యాచ్ జరిగే సమయంలోనూ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. వర్షం పడి మ్యాచ్ రద్దయితే.. ఆస్ట్రేలియాకు ఒక్క పాయింట్ వస్తుంది. అదేసమయంలో బంగ్లాపై అఫ్గాన్ గెలిస్తే నేరుగా సెమీస్ కు చేరుకుంటుంది. దీంతో ఆసీస్ సెమీస్ ఆశలు గల్లంతైనట్లే. ఒకవేళ వర్షంతో ఆసీస్ వర్సెస్ భారత్ మ్యాచ్ రద్దయినా.. బంగ్లాపై అఫ్గాన్ ఓడిపోతే ఆసీస్ సెమీస్ కు వెళ్తుంది.