MS Dhoni-Thalapathy Vijay : తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ హవా.. ధోనితో పాత ఫోటోలు వైరల్..
MS Dhoni - Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగా ధోని, విజయ్ తలపతికి (MS Dhoni-vijay) సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
tamil nadu assembly election 2026 results MS Dhoni thalapathy vijay old photos viral
MS Dhoni – Vijay : తమిళనాడులో ఎగ్జిట్ పోల్స్ సర్వే అంచనాలను తలకిందులు చేస్తూ విజయ్ తలపతి పార్టీ టీవీకే ప్రభంజనం సృష్టిస్తోంది. ఆ రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా 110 స్థానాల్లో టీవీకే అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. విజయ్ నటించిన తొలి సినిమా ప్లాప్ అయినప్పటికి కూడా రాజకీయ ప్రస్థానాన్ని సిక్సర్‌తో ప్రారంభించారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో తలపతి విజయ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నారు. ఆయనకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కొన్నిఫోటోలు అభిమానుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్నాయి. అదే టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనితో కలిసి ఉన్న ఫోటోలు.

జార్ఖండ్‌లో జన్మించినప్పటికి కూడా మహేంద్ర ధోనికి విజయ్ లాగే చెన్నైలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చెన్నై ప్రజలు ధోనిని దేవుడిలా పూజిస్తారు. ఎంతో మంది నటీనటులు కూడా ధోనికి అభిమానులు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ జాబితాలో సూపర్ స్టార్ విజయ్ కూడా ఉన్నారు. ఇక విజయ్ నటన అంటే ధోనికి కూడా ఇష్టం అని ఓ సందర్భంలో మహేంద్రుడే స్వయంగా వెల్లడించాడు.
ధోని, విజయ్ ఎప్పుడు కలుసుకున్నారు?

Sunil Narine : చరిత్ర సృష్టించిన సునీల్ నరైన్.. 19 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏకైక ఆటగాడు..
2021 ఆగస్టు 12న ధోని, విజయ్ కలుసుకున్నారు. చెన్నైలోని గోకులం స్టూడియోస్‌లో ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో ధోని ఉండగా.. అదే స్టూడియోలో విజయ్ మూవీ బీస్ట్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ క్రమంలో విజయ్, ధోని కలుసుకుని కాసేపు సరదాగా ముచ్చటించుకున్నారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
