Team India Cricketer Forgets Wife Birthday do you know what after that
Cricketer Forgets Wife Birthday : టీమ్ఇండియా ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు భారత టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉన్నాడు. అయితే.. గాయాలు, ఫామ్ లేమీతో జట్టుకు దూరం అయ్యాడు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ఆటగాడు తన భార్య పుట్టిన రోజును మరిచిపోయాడు(Cricketer Forgets Wife Birthday). ఈ విషయాన్ని స్వయంగా అతడే సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు.
ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహించిన అతడు ఓ మ్యాచ్ ముగిసిన తరువాత తన ప్రియురాలు జయకు స్టేడియంలోనే ప్రపోజ్ చేశాడు. ఇక ఆమె కూడా అతడి ప్రేమను అంగీకరించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తరువాత వీరిద్దరు 2002 జూన్ 1న పెళ్లి చేసుకున్నారు. ఈ జంట ఎంతో అన్యోన్యంగా జీవిస్తోంది.
Lionel Messi : సొంతగడ్డపై మెస్సీ చివరి మ్యాచ్ ఆడేశాడా? ఫిఫా ప్రపంచకప్ 2026 ఆడనట్లేనా?
అయితే.. ఇటీవల భార్య జయ పుట్టిన రోజును దీపక్ చాహర్ మరిచిపోయాడు. ఈ విషయాన్ని అతడు చెబుతూ తన భార్య తనను ఎంతలా అర్థం చేసుకుంటుంది అనే విషయాన్ని వివరించాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.
‘పుట్టిన రోజు శుభాకాంక్షలు జయ. నా భార్య ఎంతంగా అర్థం చేసుకుంటుందో, ప్రేమిస్తుందో అందరికి చెప్పాలని అనుకుంటున్నాను. ఆమె పుట్టిన రోజును నేను మరిచిపోయాను. కానీ ఆమె నన్ను క్షమించింది. ఎందుకంటే 90 ఓవర్ల ఫీల్డింగ్ తరువాత ఇది జరగవచ్చునని ఆమె అర్థం చేసుకుంది. వచ్చేసారి మాత్రం తప్పక గుర్తుంచుకుంటాను.’ అని దీపక్ చాహర్ రాసుకొచ్చాడు.
ప్రస్తుతం దీపక్ చాహర్ దులీప్ ట్రోఫీ 2025 సెమీస్ ఆడుతున్నాడు. అతడు సెంట్రల్ జోన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో వెస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ చేసింది. దీంతో రోజంతా చాహర్ ఫీల్డింగ్ చేశాడు. ఈ విషయాన్నే అతడు ప్రస్తావించి ఉండవచ్చు.
Asia Cup 2025 : ఆసియాకప్ 2025 మ్యాచ్‌లను ఫ్రీగా ఎక్కడ చూడొచ్చొ తెలుసా?
ఇదిలా ఉంటే.. టీమ్ఇండియా తరుపున చాహర్ 13 వన్డేలు, 25 టీ20లు ఆడాడు. వన్డేల్లో 16 వికెట్లు, టీ20ల్లో 31 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో వన్డేల్లో 203 పరుగులు, టీ20ల్లో 53 పరుగులు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ మోస్తరు ప్రదర్శననే ఇచ్చినప్పటికి ఐపీఎల్‌లో మాత్రం మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు. ఇప్పటి వరకు 95 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడగా 88 వికెట్లు సాధించాడు. బ్యాటింగ్‌లో 117 పరుగులు చేశాడు.