India vs England : తడబడిన ఇండియా, ఇంగ్లండ్‌​ బాల్‌ ట్యాంపరింగ్‌ చేసిందా?

ప్రత్యర్థికి ఆధిక్యం ఇచ్చుకున్న టీమిండియా..సెకండ్‌ ఇన్నింగ్స్‌లో తడబడింది. ఇంగ్లండ్ జట్టు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిందా అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

India vs England : తడబడిన ఇండియా, ఇంగ్లండ్‌​ బాల్‌ ట్యాంపరింగ్‌ చేసిందా?

Team Inida

Updated On : August 16, 2021 / 9:01 AM IST

England Team Ball Tampering : ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ జోరును అడ్డుకోలేక.. ప్రత్యర్థికి ఆధిక్యం ఇచ్చుకున్న టీమిండియా.. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో తడబడింది. ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో హిట్టయిన భారత్‌ టాప్ ఆర్డర్‌ రెండో ఇన్నింగ్స్‌లో తేలిపోయింది. దీంతో లార్డ్స్‌ టెస్టుపై ఇంగ్లండ్‌ పట్టుబిగించింది. 27 పరుగుల ట్రయల్స్‌తో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఇండియా నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు మాత్రమే చేసింది. ప్రస్తుతం క్రీజులో రిషత్‌ పంత్‌, ఇషాంత్‌ శర్మ ఉన్నారు. మరో రోజు ఆట మిగిలున్నా.. మ్యాచ్‌లో కోహ్లీ సేన 154 రన్స్‌ లీడ్‌లో ఉంది. చేతిలో మరో నాలుగు వికెట్లు మాత్రమే ఉండడంతో ఇండియా గెలుపు అవకాశాలు కనిపించడంలేదు. డ్రాతో గట్టెక్కాలన్నా.. ఈ రోజంతా గొప్పగా పోరాడాల్సి ఉంటుంది.

Read More : Curfew In Shillong : మేఘాలయాలో విధ్వంసం, కర్ఫ్యూ..హోం మంత్రి రాజీనామా

ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో రాహుల్‌తో పాటు రోహిత్‌, కెప్టెన్‌ కోహ్లీ వెంటవెంటనే అవుటవడం ఇండియాను దెబ్బకొట్టింది. అజింక్య రహానే హాఫ్‌ సెంచరీతో రాణించగా.. పుజారా 206 బంతుల్లో 45 పరుగులతో ప్రత్యర్థి బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. కానీ థర్డ్‌ సెషన్‌ చివర్లో వీరిద్దరితో పాటు జడేజాను అవుట్ చేసిన ఇంగ్లండ్‌ మ్యాచ్‌పై పట్టు సాధించింది. ఇదిలా ఉంటే ఇంగ్లండ్ జట్టు బాల్ ట్యాంపరింగ్ కు పాల్పడిందా అనే హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆటగాళ్లు బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. లంచ్‌ బ్రేక్‌ తర్వాత ఇద్దరు ఇంగ్లండ్‌ ప్లేయర్లు బాల్‌ను తమ షూ స్పైక్స్‌తో తొక్కడం చర్చనీయాంశమైంది. ఇండియా సెకండ్‌ ఇన్నింగ్స్‌ 35వ ఓవర్ సందర్భంగా ఈ ఘటన జరిగింది. రాబిన్సన్‌ వేసిన ఆ ఓవర్‌లో కింద పడ్డ బాల్‌ను ఓ ప్లేయర్‌ మరొకరి వైపు కాలుతో నెట్టాడు. రెండో ప్లేయర్ తన షూ స్పైక్స్‌ కింద బాల్‌ను కాసేపు అదిమిపట్టుకున్నాడు. ఈ వీడియో టెలీకాస్ట్ అయినప్పటికీ అందులో ప్లేయర్ల ముఖాలు కనిపించలేదు.

Read More : Earthquake : భూకంపానికి హైతీ విలవిల, 1300 మంది మృతి

వీడియోలో బంతిని ఉద్దేశపూర్వకంగా కింద పడేసి.. బూట్లతో తన్నుతూ.. బూట్ల స్పైక్స్‌తో అదిమి తొక్కుతూ… ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించడం స్పష్టంగా కనిపించింది. ఇది చూసిన భారత అభిమానులు ఉద్దేశపూర్వకంగా బాల్ ట్యాంపరింగ్‌కి పాల్పడిన ఇంగ్లాండ్ ప్లేయర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పదునుగా ఉండే షూ స్పైక్స్‌తో బాల్‌ను తొక్కడమంటే అది కచ్చితంగా బాల్ ట్యాంపరింగ్‌ కిందకే వస్తుందని పలువులు మాజీ క్రికెటర్లు కూడా అభిప్రాయపడ్డారు. మరి దీనిపై ఇంగ్లండ్ జట్టు ఎలా స్పందిస్తుంది ? దీనిపై ఎలాంటి చర్యలుంటాయో చూడాలి.