Team India T20I Series : న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌.. సీనియర్లకు విశ్రాంతి!

నవంబర్ లో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కు.. పలువురు సీనియర్లకు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం.

Team India T20I Series : న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌.. సీనియర్లకు విశ్రాంతి!

India t20

Updated On : October 15, 2021 / 9:41 AM IST

Team India Seniors  : నవంబర్ లో న్యూజిలాండ్‌తో జరగనున్న మూడు మ్యాచుల టీ20 సిరీస్‌కు.. పలువురు సీనియర్లకు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఈ సిరీస్ ఉండటం, పలువురు ఆటగాళ్లు నాలుగు నెలలుగా వరుసగా బయో బబుల్‌లో గడుపుతుండటం ఇందుకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. జూన్‌ నుంచి బయో బబుల్‌లో గడుపుతున్న విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ, బుమ్రా, మహమ్మద్‌ షమి లాంటి కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లుగా సమాచారం.

Read More : Petrol Rate : పెట్రోల్ ధరలు పెరిగాయని ప్రయాణికులు ఉన్న బస్సుకి నిప్పుపెట్టారు

అయితే, టీ20 ప్రపంచకప్ ముగిసిన వెంటనే నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకుంటానని కెప్టెన్ విరాట్‌ కోహ్లి ప్రకటించిండంతో.. రోహిత్‌ శర్మకు విశ్రాంతి ఇవ్వాలా.. వద్దా.. అనే విషయంలో సందిగ్దం నెలకొంది. నవంబరు 17 నుంచి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.   ఐపీఎల్‌లో మెరుగ్గా రాణించిన ఆటగాళ్లకు ఈ సిరీస్‌లో అవకాశమివ్వనున్నారు. యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్‌, హర్షల్ పటేల్‌, అవేశ్ ఖాన్‌, వెంకటేశ్‌ అయ్యర్ జట్టులో స్థానం కోసం పోటీపడుతున్నారు.

Read More : Petrol and Diesel Price : పండుగ రోజు షాక్.. పెరిగిన ఫ్యూయల్ ధరలు

అటు జాతీయ క్రికెట్‌ అకాడమీకి హెడ్‌ కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్‌ ద్రావిడ్‌.. న్యూజిలాండ్‌తో జరుగునున్న టీ20 సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వ్యవహరించనున్నారని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే, సరైన సమయంలో తర్వాతి కోచ్‌ ఎవరో వెల్లడిస్తామని బీసీసీఐ తెలిపింది. టీమిండియా ప్రస్తుత కోచ్‌ రవిశాస్త్రి పదవి కాలం ఈ నెలతో ముగియనుంది.