గెలుపు మనదే.. సిరీస్ మనదే : విండీస్ పై భారత్ ఘన విజయం

కటక్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన డిసైడర్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన భారీ స్కోర్ ను కోహ్లి సేన చేజ్ చేసింది. వికెట్ల తేడాతో విండీస్ పై గ్రాండ్

  • Published By: veegamteam ,Published On : December 22, 2019 / 04:06 PM IST
గెలుపు మనదే.. సిరీస్ మనదే : విండీస్ పై భారత్ ఘన విజయం

Updated On : December 22, 2019 / 4:06 PM IST

కటక్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన డిసైడర్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన భారీ స్కోర్ ను కోహ్లి సేన చేజ్ చేసింది. వికెట్ల తేడాతో విండీస్ పై గ్రాండ్

కటక్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన డిసైడర్ మ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. విండీస్ విధించిన భారీ స్కోర్ ను కోహ్లి సేన చేజ్ చేసింది. థ్రిల్లింగ్ మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో విండీస్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. 48.4 ఓవర్లలోనే కోహ్లి సేన 316 పరుగులు సాధించింది. ఈ గెలుపుతో 2-1 తేడాతో మూడు వన్డేల సిరీస్ ను టీమిండియా కైవసం చేసుకుంది.

విరాట్ కోహ్లి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 81 బంతుల్లో 85 పరుగులు చేసి గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. చివరల్లో జడేజా(30 బంతుల్లో 39 పరుగులు) మెరుపులు మెరిపించాడు. ఇక ఓపెనర్లు కేఎల్ రాహుల్(77), రోహిత్ శర్మ(63) హాఫ్ సెంచరీలతో రాణించారు. ముందు బ్యాటింగ్ చేసిన విండీస్.. 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. తొలి వన్డేలో ఓటమి పాలైన టీమిండియా.. తర్వాత రెండు మ్యాచుల్లో దుమ్ములేపింది. కాగా, విరాట్ కోహ్లి మరోసారి చేజింగ్ కింగ్ అని ప్రూవ్ చేసుకున్నాడు.

ఇప్పటికే అనేక రికార్డులు క్రియేట్ చేసిన టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. తన ఖాతాలో మరో రికార్డ్ వేసుకున్నాడు. 22 ఏళ్ల రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రోహిత్ శర్మ రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో ఈ రికార్డ్ శ్రీలంక ప్లేయర్ సనత్ జయసూర్య పేరున ఉంది. 1997లో సనత్ జయసూర్య ఒకే ఏడాదిలో 2వేల 387 పరుగులు సాధించాడు. 22 ఏళ్లుగా ఆ రికార్డ్ ను ఎవరూ క్రాస్ చేయలేకపోయారు. ఇప్పుడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ఆ రికార్డ్ ను బద్దలుకొట్టాడు.

కటక్ వేదికగా వెస్టిండీస్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ ఈ ఘనత సాధించాడు. 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర రికార్డ్ ను అధిగమించాడు. 2019 కేలండర్ ఇయర్ లో రోహిత్ శర్మ.. 2వేల 379 పరుగులు చేశాడు. విండీస్ తో జరిగిన మూడో వన్డే మ్యాచ్ లో మరో 9 పరుగులు జోడించి రికార్డ్ బ్రేక్ చేశాడు. ఈ ఏడాది రోహిత్ శర్మ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. వన్డేల్లో పరుగుల వరద పారించాడు. డబుల్ సెంచరీలతో చెలరేగాడు.

భారత్ బ్యాటింగ్:
విరాట్ కోహ్లి(85)
రోహిత్ శర్మ(63)
కేఎల్ రాహుల్ (77)
జడేజా (39)

48.4 ఓవర్లలో 316/6

Also Read : #15YearsOfDhonism….విధ్వంసం మొదలై 15ఏళ్లు