ప్రతీకారం తీర్చుకుంది: కివీస్‌ను ఉతికారేసిన టీమిండియా

తొలి టీ20 ఓటమికి ధీటుగా బదులిచ్చిన టీమిండియా రెండో టీ20 లో కివీస్ జట్టును ఉతికారేసింది. అన్ని విభాగాల్లో దూకుడు చూపించిన భారత్.. ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని కైవసం చేసుకుంది. హామిల్టన్‌లోని సెడాన్ పార్క్ స్టేడియం వేదికగా జరగనున్న మూడో టీ20 సిరీస్‌కు నిర్ణయాత్మకం కానుంది.
గత మ్యాచ్‌లో పేలవంగా అవుటై నిరాశపర్చిన రోహిత్ శర్మ రెండో టీ20లో 29 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. ఇది అతని కెరీర్‌లో 16వ టీ20 హాఫ్ సెంచరీ. శిఖర్ ధావన్ 31 బంతుల్లో 30 పరుగులు చేయగా, రిషబ్ పంత్(40; 28బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సు)తో, ఎంఎస్ ధోనీ(20)పరుగులతో అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ముగించారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టుపై భారత బౌలర్లు విజృంభించారు. న్యూజిలాండ్ జట్టును ఆరంభం నుంచి కట్టడి చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరికి 8వికెట్లు తీసి 158 పరుగులకు కట్టడి చేసింది. భువనేశ్వర్ కుమార్ కివీస్ ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ వికెట్ తీసి పతనాన్ని ఆరంభించగా కృనాల్ పాండ్యా వరుసగా రెండు ఓవర్లలో మూడు వికెట్లు తీసి వేగం పెంచాడు. ఆ తర్వాత ఓవర్లలో హార్దిక్ పాండ్యా 1, ఖలీల్ అహ్మద్ 2లతో ఇన్నింగ్స్‌ను ముగించారు.
కివీస్ బ్యాటింగ్‌లో గ్రాండ్ హోమ్ 28 బంతుల్లోనే 50 పరుగులు చేసి జట్టుకు అత్యధిక స్కోరు నమోదు చేశాడు.