Asian Games 2023: జాతీయ గీతాలాపన సమయంలో కన్నీరు పెట్టుకున్న యువ క్రికెటర్.. వీడియో వైరల్
2020, 2021 ఐపీఎల్ సీజన్లలో సాయి కిషోర్ చెన్నై జట్టులో సభ్యుడు. అయితే, ఆ రెండు సీజన్లలోనూ అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. 2022కు ముందు జరిగిన వేలంగా అతన్ని గుజరాత్ టైటాన్స్ జట్టు భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకుంది.

Ravisrinivasan Sai Kishore
Asian Games 2023: భారత్ జెర్సీ వేసుకొని అంతర్జాతీయ క్రికెట్లో బ్యాట్, బాలు పట్టాలని ప్రతీఒక్క క్రీడాకారుడికి ఉంటుంది. చిన్నతనం నుంచి ఆ కలను సాకారం చేసుకునేందుకు క్రీడాకారులు ప్రయత్నిస్తుంటారు. కానీ, కొందరికే భారత జెర్సీతో అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం దక్కుతుంది. ఆ సమయంలో క్రీడాకారులు భావోద్వేగానికి గురవుతూ ఉంటారు.తాజాగా భారత్ యువ ప్లేయర్ తన అరంగ్రేటం మ్యాచ్ సందర్భంగా కన్నీరు పెట్టుకున్నాడు. జాతీయ గీతాలాపన సమయంలో భావోద్వేగానికి గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆసియా క్రీడలు 2023లో భాగంగా పురుషుల క్రికెట్ విభాగంలో చైనాలోని హాంగ్ జో వేదికగా ఇండియా వర్సెస్ నేపాల్ మధ్యం టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఎడమ చేతివాటం స్పిన్నర్ రవిశ్రీనివాస్ సాయి కిషోర్ అరంగ్రేటం చేశాడు. మ్యాచ్ కు ముందు అతనికి అరంగ్రేటం క్యాప్ ను అందించారు. ఆ తరువాత మైదానంలో జాతీయ గీతాలాపన సమయంలో 26ఏళ్ల ఈ యువ స్పిన్నర్ భావోద్వేగానికిలోనై కన్నీరు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read Also : Asian Games 2023 : టీ20 క్రికెట్ చరిత్రలో యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు
2020, 2021 ఐపీఎల్ సీజన్లలో సాయి కిషోర్ చెన్నై జట్టులో సభ్యుడు. అయితే, ఆ రెండు సీజన్లలోనూ అతనికి తుది జట్టులో చోటు దక్కలేదు. 2022కు ముందు జరిగిన వేలంలో అతన్ని గుజరాత్ టైటాన్స్ జట్టు భారీ మొత్తాన్ని చెల్లించి దక్కించుకుంది. 2022 మే 10న లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జట్టు తరపున ఐపీఎల్ లో అరంగ్రేటం చేశాడు. ఈ సీజన్ లో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడి సాయి కిషోర్.. ఆరు వికెట్లు పడగొట్టాడు. ఆ సీజన్ లో గుజరాత్ జట్టు విజేతగా నిలిచింది. 2023లో గుజరాత్ జట్టులో సభ్యుడిగా ఉన్నప్పటికీ తుది జట్టులో అవకాశం దక్కలేదు.
టీ20 క్రికెట్ లో అతని ఆటతీరు మెరుగ్గా ఉంది. 49 టీ20 మ్యాచ్ లు ఆడిన సాయి కిషోర్ 16.91 సగటుతో 57 వికెట్లు తీశాడు. తాజాగా ఆసియా క్రీడల్లో భారత్ జట్టు నేపాల్ జట్టుపై తొలి మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో సాయి కిషోర్ అరంగ్రేటం చేశాడు. ఈమ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసిన సాయి కిషోర్ 25 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
The emotional Sai Kishore during India's national anthem.
He bowled really well on his debut – 1/26 in the Quarter Finals of Asian Games. pic.twitter.com/sWD9Afx9TD
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 3, 2023