Premier Handball League : తెలుగు టాలన్స్ హ్యాట్రిక్ విజయాలు.. సెమీస్‌కు చేరువ
ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ లో తెలుగు టాలన్స్(Telugu Talons) దుమ్ములేపుతోంది. హ్యాట్రిక్ విజయాలను అందుకుంది.

TT vs RP
Premier Handball League 2023 : ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ లో తెలుగు టాలన్స్(Telugu Talons) దుమ్ములేపుతోంది. హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. శనివారం జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ ఇండోర్ స్టేడియంలో రాజస్థాన్ పాట్రియాట్స్(Rajasthan Patriots)తో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించింది. తెలుగు టాలన్స్‌కు ఇది వరుసగా మూడో గెలుపు. కాగా.. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన టాలన్స్ ఐదు విజయాలను సాధించి నాకౌట్ బెర్త్ ను దాదాపుగా ఖాయం చేసుకుంది.

TT vs RP
ఈ మ్యాచ్‌లో ఆరంభం నుంచీ తెలుగు టాలన్స్ దూకుడుగా ఆడింది. ఏ దశలోనూ రాజస్థాన్‌కు అవకాశం ఇవ్వలేదు. కీలక ఆటగాళ్లైన దేవిందర్ సింగ్ భుల్లార్, నసీబ్ సింగ్, రఘు, అనిల్ సహా రాహుల్, మోహిత్ రాణించటంతో టాలన్స్‌కు ఎదురులేకుండా పోయింది. ప్రథమార్థం ముగిసే సరికి 14-10తో నాలుగు గోల్స్ ఆధిక్యంతో నిలిచింది. ఇక రెండో అర్థభాగంలో టాలన్స్ ఆటగాళ్లు మరింత రెచ్చిపోయారు. గోల్ కీపర్ రాహుల్ అద్భుత విన్యాసాలతో రాజస్థాన్ గోల్ ప్రయత్నాలను అడ్డుకున్నాడు.

TT vs RP
టాలన్స్ ఎటాకర్లు గోల్స్ వర్షం కురిపించారు. ఆటలో చివరి పది నిమిషాల పాటు కనీసం 10 గోల్స్ ఆధిక్యంలో నిలిచిన తెలుగు టాలన్స్ చివరికి 33-22తో 11 గోల్స్ తేడాతో ఈ సీజన్లోనే అత్యంత భారీ విజయాన్ని నమోదు చేసింది. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది తెలుగు టాలన్స్.

TT vs RP