Indian Racing league: చిరు జల్లుల్లోనే ప్రీ ప్రాక్టీస్ రేస్ .. రయ్ మంటూ దూసుకెళ్లిన రేసింగ్ కార్లు..
ఆదివారం ఉదయం షెడ్యూల్ ప్రకారం రేసింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలుత శనివారం రద్దయిన రేస్‌ల నిర్వహణ కొనసాగింది. సాయంత్రం వరకు అన్ని పోటీలను పూర్తిచేసేలా నిర్వాహకులు చర్యలు చేపట్టారు.

Indian Racing league
Indian Racing league: ఇండియన్ రేసింగ్ లీగ్ (ఐఆర్ఎల్)లో భాగంగా ఆదివారం చిరుజల్లుల మధ్యనే రయ్ మంటూ రేసింగ్ కార్లు దూసుకెళ్లాయి. నగరం నడిబొడ్డున రెండు రోజుల పాటు ఫార్ములా కార్ రేసింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. అయితే, తొలిరోజు శనివారం రేసింగ్ నిర్వహణలో గందరగోళం నెలకొంది. హైదరాబాద్ స్ట్రీట్ సర్క్యూట్‌పై కేవలం ఒకే ఒక్క ప్రాక్టీస్ రేసు మాత్రమే జరిగింది. అదికూడా సాయంత్రం నాలుగు గంటలకు మొదలైంది. దీంతో క్వాలిఫైయింగ్ పోటీలు జరపకుండా రెండు ప్రాక్టీస్ సెషన్స్ మాత్రమే నిర్వహించారు. ఇవాళ ఉదయం 9గంటలకే ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి.
Indian Racing League : నేడు, రేపు హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం ఉదయం షెడ్యూల్ ప్రకారం రేసింగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలుత శనివారం రద్దయిన రేస్‌ల నిర్వహణ కొనసాగింది. తొలి 30 నిమిషాలకు సంబంధించి రేస్ పూర్తయింది. క్వాలీఫైయింగ్-1, క్వాలిఫైయింగ్ -2 పోటీలను నిర్వహించారు. ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లో రేస్ పూర్తిచేసే యోచనలో నిర్వాహకులు ఉన్నారు. తొలుత వర్షం కారణంగా పోటీలు జరుగుతాయా? లేదా? అనే అనుమానం వ్యక్తమయినప్పటికీ.. షెడ్యూల్ ప్రకారమే రేసింగ్ ప్రారంభం కావటం, వర్షం ఆగిపోవటంతో సాయంత్రం వరకు అన్ని పోటీలను పూర్తిచేసేలా నిర్వాహకులు చర్యలు చేపట్టారు.
Indian Racing League : హైదరాబాద్ కార్ రేసింగ్‌లో మరో ప్రమాదం, రెండు రేస్ కార్లు ఢీ
ఇండియన్ రేసింగ్ లీగ్‌కు సంబంధించి ఇవాళ మెయిన్ రేసింగ్‌లు జరుగుతాయి. మొత్తం తొమ్మిది రేసులు ఆదివారం జరగనున్నాయి. అందులో క్వాలిఫైయింగ్ రేసులు కాగా, ప్రాక్టిస్ కు సంబంధించిన రేసులు జరుగుతాయి. చివరకు ఇండియన్ రేసింగ్ ఫైనల్ జరగనుంది. రెండు రోజులుపాటు జరుగుతున్న ఈ రేసింగ్ లో మొత్తం 24 మంది డ్రైవర్లు, 12 కార్లు, ఆరు టీంలుగా విడిపోయి పాల్గొంటున్నారు. హైదరాబాద్ బ్లూబర్డ్స్ కు సంబంధించిన టీం రేసింగ్ లో ముందు వరుసలో ఉంది. సొంత గడ్డపై జరిగే పోటీల్లో ఎలాగైనా విజేతగా నిలవాలని బ్లూబర్డ్స్ ప్రయత్నిస్తుంది. మరోవైపు వర్షం కారణంగా ప్రేక్షకుల సంఖ్య ఆశించిన స్థాయిలో లేదు. ఫైనల్ రేసింగ్ సమయానికి భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి ఈ రోజు అన్ని పోటీలను పూర్తిచేసేందుకు నిర్వాహకులు పట్టుదలతో ఉన్నారు.