చాహల్.. నాకంటే చిన్నవాడివి : మహిళా క్రికెటర్ కామెంట్

  • Published By: sreehari ,Published On : December 17, 2019 / 11:16 AM IST
చాహల్.. నాకంటే చిన్నవాడివి : మహిళా క్రికెటర్ కామెంట్

Updated On : December 17, 2019 / 11:16 AM IST

టీమిండియా స్పిన్నర్ యజువేంద్ర చాహల్ పై ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియల్లె వ్యాట్  సరదాగా కామెంట్ చేసింది. సోషల్ మీడియాలో తనదైన సెన్స్ ఆఫ్ హ్యుమర్‌తో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే ఆమె చాహల్ ను ఏడ్పించాలని నిర్ణయించుకుంది. చాహల్.. నువ్వు నాకంటే చాలా చిన్నవాడివోయ్ అంటూ లాఫింగ్ ఎమోజీని తో పోస్టు పెట్టింది. ఇటీవల చాహల్.. తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో ఓ ఫొటో పోస్టు చేశాడు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Making headshots look fun here in Chennai ? ??

A post shared by Yuzvendra Chahal (@yuzi_chahal23) on

ఆ ఫొటోలో చాహల్ పక్కనే మరో భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా ఉన్నాడు. చెన్నైలో ఓ షూట్ సమయంలో వీరిద్దరూ ఇలా సరదగా ఫొటో దిగారు. ఈ ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేస్తూ.. ‘చెన్నైలో హెడ్ షాట్స్ చేయడం చూడటానికి చాలా ఫన్నీగా ఉంది’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. చాహల్ షేర్ చేసినా ఈ ఫొటోపై ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ డానియల్లె ఫన్నీగా కామెంట్ చేసింది.
chahal

చెన్నైలో వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టులో చాహల్ కు చోటు దక్కలేదు. కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ లో ఆడినప్పటికీ కనీసం ఒక్క వికెట్ కూడా తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెటర్లలో స్పిన్నర్లు ఇద్దరూ అద్భుతంగా రాణించారు.

ఐసీసీ ప్రపంచ కప్ లో వీరిద్దరి ‘కుల్చా’ భాగసామ్యంలో ప్రదర్శన పేలవంగా ఉండటంతో టీమ్ మేనేజ్ మెంట్ కొత్త స్పిన్ ఆప్షన్లపై దృష్టిపెట్టింది. ప్రస్తుతం జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ లో టీమిండియా తప్పక గెలవాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ.. చాహల్, కుల్దీప్ కాంబినేషన్ స్పిన్నర్లను జట్టులోకి తీసుకుంటాడో లేడో చూడాలి.