కోలుకున్న టైగర్.. హాస్పిటల్ నుంచి ఇంటికి!

Tiger Woods Leaves L A Hospital Returns Home1
ప్రముఖ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ ప్రమాదానికి గురైన నెల తర్వాత కోలుకున్నాడు. అమెరికాలోని రోలింగ్ హిల్స్ ఎస్టేట్స్, రాంచో పాలోస్ వెర్డెస్ సరిహద్దుల్లో కారు అదుపుతప్పి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టైగర్ వుడ్స్ తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు నెల రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది మంగళవారం(16 మార్చి 2021) డిశ్చార్ అయ్యారు. కోలుకున్న తర్వాత తన క్షేమ సమాచారం ఇస్తూ ట్వీట్ చేశారు వుడ్స్.
తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లుగా వెల్లడించిన టైగర్ వుడ్స్.. తాను త్వరగా కోలుకోవాలని ప్రార్ధనలు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. తనకు వైద్య సేవలు అందించిన డాక్టర్స్, ఆసుపత్రి స్టాఫ్ తోపాటు UCLA మెడికల్ సెంటర్, సెడర్స్ సినాయ్ మెడికల్ సెంటర్ వారికి రుణపడి ఉంటానని తెలిపారు వుడ్స్. అయితే ఈ ప్రమాదంలో వుడ్స్ కుడి కాలు విరిగిపోయింది. వెన్నెముక, పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. వుడ్స్ కి డాక్టర్లు నాలుగు సర్జరీలు చేశారు.
మరోవైపు.. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమయంలో వుడ్స్ ఎటువంటి మత్తు పదార్దాలు తీసుకోలేదని పోలీసులు చెప్పారు. అతివేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు వివరించారు. ఈ ప్రమాదంలో కారు నుజ్జు నుజ్జు అయింది.
— Tiger Woods (@TigerWoods) March 16, 2021