IND vs BAN 2nd Test: క్లీన్‌స్వీప్ పై టీమిండియా కన్ను.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు మార్గం సుగమం అయ్యేనా..
టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ కు టీమిండియాకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా పరాజయం పాలవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో సఫారీ జట్టును వెనక్కి నెట్టి భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్ తన చివరి టెస్టు సిరీస్‌ను సొంతగడ్డపై ఆడబోతోంది.

Team india
IND vs BAN 2nd Test: బంగ్లాదేశ్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో ఉదయం 9గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. మొదటి టెస్ట్ లో ఘన విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టులోనూ అదేజోరును కొనసాగించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే పట్టుదలతో ఉంది. మొదటి టెస్ట్ కే.ఎల్. రాహుల్ సారథ్యంలో ఆడిన టీమిండియా రెండో టెస్టులో మార్పులు జరిగే అవకాశం ఉంది. రాహుల్ కు గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో తుదిజట్టు ప్రకటించేవరకు రాహుల్ ఆడేది అనుమానంగానే కనిపిస్తుంది. దీంతో రాహుల్ స్థానంలో కోహ్లీ, పుజారా సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశాలు లేకపోలేదు.
India vs Bangladesh Match: బంగ్లాతో రెండో టెస్ట్‌కూ దూరమైన రోహిత్.. జట్టును ప్రకటించిన బీసీసీఐ
టెస్ట్ సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేస్తే డబ్ల్యూటీసీ ఫైనల్ కు టీమిండియాకు మార్గం సుగమం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదే సమయంలో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా పరాజయం పాలవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌లో సఫారీ జట్టును వెనక్కి నెట్టి భారత్ రెండో స్థానానికి ఎగబాకింది. అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో ఈ డబ్ల్యూటీసీ సైకిల్లో భారత్ తన చివరి టెస్టు సిరీస్‌ను సొంతగడ్డపై ఆడబోతోంది. ఆ సిరీస్ లోనూ టీమిండియా గెలిస్తే ఫైనల్ బెర్తు దక్కుతుంది. ఇదంతా జరగాలంటే ప్రస్తుతం బంగ్లాతో జరిగే రెండో టెస్టులోనూ భారత్ జట్టు విజయం సాధించాల్సి ఉంది.
Bangladesh vs India: మొదటి టెస్టులో బంగ్లాదేశ్‌పై భారత్ 188 పరుగుల తేడాతో విజయం
రెండో టెస్టులో కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆడేది అనుమానంగా మారింది. ప్రాక్టిస్ సమయంలో రాహుల్ గాయపడటంతో తుదిజట్టులో ఆడతాడా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, షమీతో సహా పలు కీలక ఆటగాళ్లు గాయాలతో టెస్టు సిరీస్ నుంచి దూరమయ్యారు. ఈ క్రమంలో రాహుల్ సైతం తుదిజట్టులో లేకుంటే టీమిండియాకు కొంత ఎదురుదెబ్బ అనే చెప్పొచ్చు. రెండో టెస్టులో పిచ్‌పై ఎప్పుడూ స్పిన్నర్లదే ఆధిపత్యం. దీంతో తుదిజట్టులో భారత్ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ తీసుకొనే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే.. తొలి రోజు బ్యాటింగ్ కు పిచ్ అనుకూలంగా ఉంటుంది.