Top five: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‍‌ల రికార్డ్.. టాప్ 5లో ఇద్దరు ఇండియన్స్!

టీమ్ రికార్డ్‌లు, వ్యక్తిగత రికార్డ్‌లు క్రికెట్‌లో ఎక్కువగా ప్రస్తావించే విషయాలు. క్రికెట్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లకు ఉండే క్రేజ్ వేరు.. క్రికెట్‌లో ప్రతీ మ్యాచ్‌లో గెలిచిన జట్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన ఆటగాడికి లేదా ఆటతీరుతో మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఆటగాడికి, అప్పుడప్పుడు జట్టు ఓడిపోయినా కూడా బాగా ఆడిన ఆటగాడికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ఇవ్వబడుతుంది.

Top five: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‍‌ల రికార్డ్.. టాప్ 5లో ఇద్దరు ఇండియన్స్!

Player

Updated On : June 30, 2021 / 6:52 PM IST

Man of the Match Awards: టీమ్ రికార్డ్‌లు, వ్యక్తిగత రికార్డ్‌లు క్రికెట్‌లో ఎక్కువగా ప్రస్తావించే విషయాలు. క్రికెట్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లకు ఉండే క్రేజ్ వేరు.. క్రికెట్‌లో ప్రతీ మ్యాచ్‌లో గెలిచిన జట్టులో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన ఆటగాడికి లేదా ఆటతీరుతో మ్యాచ్‌ను మలుపు తిప్పిన ఆటగాడికి, అప్పుడప్పుడు జట్టు ఓడిపోయినా కూడా బాగా ఆడిన ఆటగాడికి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు ఇవ్వబడుతుంది. ఎక్కువగా మ్యాచ్ టైటిల్ ప్లేయర్ గెలిచిన జట్టు ఆటగాడికి ఇవ్వబడుతుంది.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్ గెలవడం అంటే అంత సులభం కాదు.. మొత్తం 22మందిలో ఒకరు మాత్రమే రెండు జట్లలో బెస్ట్ పెర్ఫామ్ చేస్తారు. వారికే ఈ అవార్డు ఇస్తారు. అంతర్జాతీయ క్రికెట్‌లో వారి ప్రతిభ కారణంగా క్రికెట్ కెరీర్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్‌ను గెలుచుకున్న ఆటగాళ్లకు కొరత లేదు. అటువంటి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు ఎక్కువగా కైవసం చేసుకున్న ఆటగాళ్లలో భారత మాజీ వెటరన్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్ మొదటి స్థానంలో ఉన్నాడు. క్రికెట్ చరిత్రలో, సచిన్ టెండూల్కర్ కంటే మరే ఆటగాడు ఎక్కువ మ్యాచ్ టైటిల్‌లను గెలుచుకోలేదు. సచిన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో టెస్ట్, వన్డే, టీ20లు మొత్తం కలిపి 664 మ్యాచ్‌లు ఆడాడు. సచిన్, ఇప్పటివరకు మొత్తం 76 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఇదే ఇప్పటివరకు అతిపెద్ద రికార్డు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్‌ను గెలుచుకున్న వ్యక్తుల్లో శ్రీలంక మాజీ ఆల్ రౌండర్ సనత్ జయసూర్య రెండో స్థానంలో ఉన్నాడు. తన క్రికెట్ కెరీర్‌లో మొత్తం 586 మ్యాచ్‌ల్లో 58సార్లు ఈ టైటిళ్లను గెలుచుకున్నాడు. తర్వాతి స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు, అతను ఇప్పటివరకు 436 మ్యాచ్‌లను ఆడగా.. 57 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు, జాక్వెస్ కలిస్ కూడా మూడో ప్లేస్‌లోనే, అదే సంఖ్యలో టైటిళ్లను గెలుచుకున్నాడు. జాక్వెస్ కాలిస్ 519 మ్యాచ్‌లలో 57 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ టైటిళ్లను గెలుచుకున్నాడు. తర్వాతి స్థానంలో కుమార్ సంగక్కర 594 మ్యాచ్‌లలో 50 సార్లు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ టైటిల్‌ను గెలుచుకున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిల్ గెలుచుకున్న ఐదుగురు బ్యాట్స్‌మెన్లు:

సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) – 76(మ్యాచ్‌లు – 664)
సనత్ జయసూర్య(Sanath Jayasuriya) – 58(మ్యాచ్‌లు -586)
విరాట్ కోహ్లీ(Virat Kohli) – 57(మ్యాచ్‌లు – 436)
జాక్వెస్ కలీస్(Jacques Kallis) – 57(మ్యాచ్‌లు – 519)
కుమార్ సంగక్కర(Kumar Sangakkara) – 50(మ్యాచ్‌లు – 594)