U19 Asia Cup 2025 : దంచికొట్టిన పాక్ ఓపెన‌ర్‌.. ఆసియాక‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ ముందు భారీ టార్గెట్‌..

దుబాయ్‌లోని ఐసీసీ అకాడ‌మీ గ్రౌండ్‌లో అండ‌ర్‌-19 ఆసియా క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో (U19 Asia Cup 2025 ) భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి.

U19 Asia Cup 2025 : దంచికొట్టిన పాక్ ఓపెన‌ర్‌.. ఆసియాక‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్ ముందు భారీ టార్గెట్‌..

U19 Asia Cup 2025 Final Team India target is 348

Updated On : December 21, 2025 / 2:45 PM IST

U19 Asia Cup 2025 : దుబాయ్‌లోని ఐసీసీ అకాడ‌మీ గ్రౌండ్‌లో అండ‌ర్‌-19 ఆసియా క‌ప్ ఫైన‌ల్ మ్యాచ్‌లో భార‌త్‌, పాకిస్తాన్ జ‌ట్లు త‌ల‌ప‌డుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్ జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 347 ప‌రుగులు చేసింది. దీంతో భార‌త్ ముందు 348 ప‌రుగుల భారీ ల‌క్ష్యం నిలిచింది.

Viral video : ఇదేంట్రా బాబు.. పాక్‌లో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కింద‌ మేక‌, రెండు బాటిళ్ల వంట‌నూనె..?

పాక్ బ్యాట‌ర్ల‌లో సమీర్ మిన్హాస్ (172; 113 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్స్‌లు) భారీ శ‌త‌కం సాధించాడు. అహ్మద్ హుస్సేన్ (56; 72 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) అర్థ‌శ‌త‌కం సాధించాడు. ఉస్మాన్ ఖాన్ (35) ప‌ర్వాలేద‌నిపించ‌గా ఫర్హాన్ యూసుఫ్‌ (19), హంజా జహూర్ (18) లు విఫ‌లం అయ్యారు. టీమ్ఇండియా బౌలర్లలో దీపేశ్‌ దేవేంద్రన్ మూడు వికెట్లు తీశాడు. హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. కాన్షిక్ చౌహాన్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.