U19 World Cup Final : భారత బౌలర్లు భళా.. 189 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్
అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఇంగ్లండ్ ను సమర్థవంతంగా కట్టడి చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయింది.

U19 World Cup Final Raj Bawa
U19 World Cup Final : అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ఇంగ్లండ్ ను సమర్థవంతంగా కట్టడి చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకే ఆలౌట్ అయింది. నార్త్ సౌండ్ లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది.
పిచ్ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్న భారత పేసర్లు ఇంగ్లండ్ టాపార్డర్ ను కకావికలం చేశారు. ముఖ్యంగా రాజ్ బవా (5 వికెట్లు), రవికుమార్ (4 వికెట్లు) విజృంభించారు. ఓ దశలో ఇంగ్లండ్ జట్టు 61 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు 100 పరుగులు చేయడం కూడా కష్టమే అనిపించింది.
Mukesh Ambani: భారత్ లోనే అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీ
అయితే మిడిలార్డర్ బ్యాట్స్ మన్ జేమ్స్ రూ అద్భుతంగా ఆడి 95 పరుగులు చేశాడు. 116 బంతులు ఎదుర్కొన్న రూ 12 ఫోర్లు కొట్టాడు. అతడికి జేమ్స్ సాలెస్ (34 నాటౌట్) నుంచి మంచి సహకారం లభించింది. అంతకుముందు, ఓపెనర్ జార్జ్ థామస్ 27 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో బవా 5 వికెట్లు, రవికుమార్ 4 వికెట్లు తీయగా.. కుషాల్ తాంబే ఒక వికెట్ తీశాడు.
Worst Passwords: ఈ పాస్‌వర్డ్‌లు పెట్టుకున్నారా? వెంటనే మార్చుకోండి.. సెకన్లలో హ్యాక్ చేసేస్తారు
190 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ రెండో బంతికే తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రఘువంశీ డకౌట్ అయ్యాడు. జోషువా బాయ్‌డెన్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి అతడు క్యాచ్ ఔటయ్యాడు. జోషువా బాయ్‌డెన్ వేసిన తొలి ఓవర్లో భారత్ కు పరుగులేమీ రాలేదు.