Umpire Caught: మ్యాచ్ మధ్యలో బాల్ క్యాచ్ అందుకున్న అంపైర్!

శ్రీలంక వేదికగా జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ సందర్భంగా మూడో మ్యాచ్ ప్రేమదశ వేదికగా జరిగింది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 50ఓవర్లల 6వికెట్ల నష్టానికి 291పరుగులు చేశాడు.

Umpire Caught: మ్యాచ్ మధ్యలో బాల్ క్యాచ్ అందుకున్న అంపైర్!

Umpire Ball

Updated On : June 20, 2022 / 2:28 PM IST

 

Umpire Caught: శ్రీలంక వేదికగా జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ సందర్భంగా మూడో మ్యాచ్ ప్రేమదశ వేదికగా జరిగింది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుని 50ఓవర్లల 6వికెట్ల నష్టానికి 291పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ లో ఓ వింత ఘటన నమోదైంది. అంపైర్ ధర్మసేన తన వైపుగా వస్తున్న బంతికి అడ్డు తప్పుకోకుండా క్యాచ్ అందుకునే ప్రయత్నం చేశాడు.

స్క్వేర్ లెగ్‌తో నిల్చొని దాదాపు బంతి పట్టేసుకున్నాడనేంత పొజిషన్ లో కనిపించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఇదే వీడియోను పోస్టు చేస్తూ.. “అంపైర్ కుమార్ ధర్మసేన కూడా ఆడేద్దామనుకున్నాడేమో.. మంచిదైంది ఆడలేదు” అని ట్వీట్ చేసింది.

292 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన శ్రీలంక 9బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. 4వికెట్లు కోల్పోయి సాధించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ను పాతమ్ నిస్సంకా సాధించాడు.

Read Also: మరోసారి ఫ్రస్టేషన్ లో కోహ్లీ.. అంపైర్