IPL 2023: తీవ్రగాయంతో ఐపీఎల్ నుంచి వైదొలిగిన మరో ప్లేయర్

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023) నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ రజత్ పటీదార్ వైదొలిగాడు. గాయం కారణంగా అతడు చికిత్స తీసుకోవాల్సి ఉంది.

IPL 2023: తీవ్రగాయంతో ఐపీఎల్ నుంచి వైదొలిగిన మరో ప్లేయర్

Rajat Patidar

Updated On : April 4, 2023 / 4:46 PM IST

IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023 (IPL 2023) నుంచి మరో ఆటగాడు గాయం కారణంగా వైదొలిగాడు. ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) కీలక ప్లేయర్ కేన్ విలియమ్సన్ మోకాలి గాయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి వైదొలిగి న్యూజిలాండ్ చేరుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నుంచి రజత్ పటీదార్ (Rajat Patidar) కూడా గాయంతో ఐపీఎల్ నుంచి వైదొలిగాడు.

మడమకు తీవ్రగాయం కావడంతో అతడు ప్రస్తుత సీజన్ ఐపీఎల్ కు దూరమవుతున్నాడని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపింది. రజత్ త్వరగా కోలుకోవాలని తాము కోరుకుంటున్నామని, అందుకు తమ సహకారం ఉంటుందని చెప్పింది. అతడి స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటామన్న విషయంపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోచులు, మేనేజ్ మెంట్ ఇప్పటివరకు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటివరకు ఒక మ్యాచు ఆడి అందులో గెలుపొందింది. 22 బంతులు మిగిలి ఉంగానే ముంబై జట్టుపై 8 పరుగుల తేడాతో ఇటీవల విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్-2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు బలమైన టీమ్ గా ఉంది.

Kane Williamson Video: అయ్యయ్యో.. కుడి కాలు కదిలించలేని స్థితిలో సొంత దేశానికి కేన్ విలియమ్సన్