Vaibhav Sooryavanshi : జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ కీలక వ్యాఖ్యలు.. అనుభవం ఉంది.. దంచికొడతా..
జింబాబ్వేతో టీ20 సిరీస్‌కు ముందు వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi ) కీలక వ్యాఖ్యలు చేశాడు.
Vaibhav Sooryavanshi key comments ahead of t20 series against Zimbabwe
Vaibhav Sooryavanshi : గురువారం (జూలై 23) నుంచి భారత్, జింబాబ్వే జట్ల మధ్య మూడు మ్యాచ్ టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో బీసీసీఐ టీవీతో టీమ్ఇండియా నయా బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత నాలుగు నెలల్లో తన కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని తెలిపాడు. అయినప్పటికి కూడా జింబాబ్వేతో గురువారం ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు తాను పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు తెలిపాడు.
గత నాలుగు నెలల్లో చాలా ఒడిదుడుకులు ఎదురయ్యాయి. కానీ అవన్నీ క్రికెట్లో భాగమే. అలాంటివి వస్తూనే ఉంటాయి. నేను నా ప్రక్రియను (ప్రాసెస్) నమ్ముకుంటూ, జట్టు కోసం 100 శాతం కషి చేస్తాను. అని వైభవ్ చెప్పుకొచ్చాడు.
Hashmatullah Shahidi : అఫ్గానిస్థాన్ వన్డే కెప్టెన్ పదవికి హష్మతుల్లా షాహిదీ రాజీనామా
హరారే వేదికగా జింబాబ్వేతో మూడు మ్యాచ్‌లు ఆడనుండడంపై మాట్లాడుతూ.. ఈ మైదానం నాకు చాలా ప్రత్యేకం. నాలుగు నెలల క్రితమే ఇక్కడే అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ గెలిచాం. భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం ప్రతి ఒక్కరి కల. అదే మైదానంలో మళ్లీ భారత తరఫున ఆడే అవకాశం రావడం ఎంతో ప్రత్యేకమైన అనుభూతి. దీన్ని నేను ఆస్వాదిస్తున్నాను. ఈ మైదానంలో రెండు మ్యాచ్‌లు ఆడి మంచి ఫలితాలు సాధించాను. ఇక్కడి పిచ్‌లు, ఇక్కడి పరిస్థితులపై నాకు మంచి అవగాహన ఉంది. అండర్-19 ప్రపంచకప్ అనుభవాన్ని సద్వినియోగం చేసుకుని అదే జోరును కొనసాగించాలని ఆశిస్తున్నాను. అని వైభవ్ సూర్యవంశీ పేర్కొన్నాడు.
View this post on Instagram
ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలవడంలో వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఇదే వేదికపై జరిగిన ఫైనల్లో ఇంగ్లాండ్‌పై కేవలం 80 బంతుల్లో 175 పరుగులు చేసి భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.
ఇక ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో 15 ఏళ్ల వైభవ్‌కు భారత జట్టులో చోటు దక్కింది. మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న అత్యంత పిన్న వయసులో భారత తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన రికార్డును అధిగమించాడు.
David Warner : తాగి వాహనం నడిపిన డేవిడ్ వార్నర్.. ఆగస్టు 18న శిక్ష విధించనున్న కోర్టు..
మూడు మ్యాచ్‌ల్లో అతనికి అవకాశాలు లభించినా.. ఆశించిన స్థాయిలో పరుగులు సాధించలేకపోయాడు. దీంతో ఇంగ్లాండ్‌తో 5వ టీ20లో వైభవ్‌ను తుది జట్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌తో ఐదో టీ20లో అవకాశం రాకపోవడంతో వైభవ్ భావోద్వేగానికి గురయ్యాడు. అయితే కోచ్‌లు, సహచరుల మద్దతుతో ఆ నిరాశ నుంచి త్వరగా బయటపడి మళ్లీ తన ఆటపై దృష్టి పెట్టానని తెలిపాడు.
