Vaibhav Suryavanshi : వైభవ్ సూర్యవంశీ వయస్సు పై ఆరోప‌ణ‌లు.. 13 ఏళ్లు కాదు 15.. స్పందించిన తండ్రి..

క్రికెట్ ప్ర‌పంచంలో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన వైభవ్ సూర్య‌వంశీ గురించే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగుతోంది.

Vaibhav Suryavanshi faces Age Fraud Allegations Father Responds

క్రికెట్ ప్ర‌పంచంలో ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసిన వైభవ్ సూర్య‌వంశీ గురించే ప్ర‌ధానంగా చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ 13 ఏళ్ల కుర్రాడు ఐపీఎల్ వేలంలో కోట్లు కొట్టాడు. ఐపీఎల్ వేలంలో అమ్ముడుపోయిన అత్యంత పిన్న వ‌య‌స్కుడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ బీహార్ కుర్రాడిని రాజ‌స్థాన్ రాయ‌ల్స్ రూ.1.10 కోట్ల‌కు కొనుగోలు చేసింది. అయితే.. అత‌డి వ‌య‌స్సు 15 ఏళ్లు అన్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనిపై తాజాగా అత‌డి తండ్రి సంజీవ్ స్పందించాడు. వీటిని కొట్టిపారేశాడు. వైభ‌వ్ వ‌య‌స్సు 13 ఏళ్లే అని తేల్చి చెప్పాడు.

ప్ర‌స్తుతం వైభ‌వ్ అండ‌ర్‌-19 ఆసియా క‌ప్ కోసం దుబాయ్‌లో ఉన్నాడ‌ని అన్నారు. వైభ‌వ్ చిన్న‌ప్ప‌టి నుంచి ఎంతో క‌ష్ట‌ప‌డ్డాడ‌ని చెప్పారు. 8 ఏళ్ల వ‌య‌సులోనే అండ‌ర్ 16 జిల్లా ట్ర‌య‌ల్స్‌లో అద్భుతంగా ఆడాడ‌ని తెలిపారు. కోచింగ్ కోసం అత‌డిని స‌మ‌స్తిపూర్‌కి తీసుకువెళ్లి, తీసుకువ‌చ్చేవాడిన‌ని అన్నారు. అత‌డు క్రికెట‌ర్‌గా ఎదిగేందుకు పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేశానని చెప్పాడు. ఇందుకోసం త‌న భూమిని అమ్మేశాన‌ని, అయిన‌ప్ప‌టికి ఇప్ప‌టికి కూడా ఆర్థిక స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లుగా చెప్పుకొచ్చాడు.

IPL Mega Auction 2025 : ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోని బ్యాట‌ర్లు, బౌల‌ర్లు, ఆల్‌రౌండ‌ర్లు వీరే.. డేవిడ్ వార్న‌ర్ నుంచి పృథ్వీ షా వ‌ర‌కు..

అత‌డికి ఎనిమిదిన్న‌ర సంవ‌త్స‌రాలు ఉన్న‌ప్పుడు తొలిసారి బీసీసీఐ ఎముక ప‌రీక్ష‌కు హాజ‌రు అయ్యాడు. అత‌డు ఇప్ప‌టికే ఇండియా అండ‌ర్ -19 జ‌ట్టుకు ఆడాడు. మేము ఎవ్వ‌రికి భ‌య‌ప‌డం. అవ‌స‌రం అయితే మ‌ళ్లీ ఎముక ప‌రీక్ష చేయించుకోవ‌చ్చున‌ని సంజీవ్ చెప్పాడు.

ఇక వేలం కంటే ముందు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ నాగ్‌పూర్‌లో నిర్వ‌హించిన ట్ర‌య‌ల్స్‌లో సూర్య‌వంశీ పాల్గొన్న‌ట్లుగా సంజీవ్ చెప్పాడు. బ్యాటింగ్ కోచ్ విక్ర‌మ్ రాథోడ్ ఒకే ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు చేయాల‌ని చెప్పాడు. అప్పుడు వైభ‌వ్ మూడు సిక్స‌ర్లు బాదాడు. మొత్తంగా ట్ర‌య‌ల్స్‌లో ఎనిమిది సిక్స‌ర్లు, నాలుగు ఫోర్లు కొట్టిన‌ట్లు సంజీవ్ తెలిపాడు.

IPL Mega Auction 2025 : ముగిసిన వేలం.. ఏ జ‌ట్టులో ఎవ‌రు ఉన్నారు.. అప్‌డేటెడ్ ఫుల్ లిస్ట్ ఇదే..