Glenn Maxwell Wedding : భారత సంతతి అమ్మాయిని పెళ్లాడనున్న మ్యాక్స్‌వెల్ .. తమిళంలో శుభలేఖ వైరల్..!

ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ RCB ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. భారత సంతతికి చెందిన అమ్మాయి విని రామన్‌ను మ్యాక్స్ వెల్ పెళ్లి చేసుకోబోతున్నాడు.

Glenn Maxwell Wedding : భారత సంతతి అమ్మాయిని పెళ్లాడనున్న మ్యాక్స్‌వెల్ .. తమిళంలో శుభలేఖ వైరల్..!

Glenn Maxwell Set To Marry Indian Origin Fiance, Wedding Card Printed In Tamil Goes Viral

Updated On : February 16, 2022 / 9:59 AM IST

Glenn Maxwell Wedding : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్ వెల్ (Glenn Maxwell) పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. భారత సంతతికి చెందిన అమ్మాయిని మ్యాక్స్ వెల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ ఏడాదిలోనే మార్చి 27న హిందు సాంప్రదాయంలో భారత సంతతికి చెందిన విని రామన్ (Vini Raman)తో మ్యాక్స్ వెల్ పెళ్లి జరుగనుంది. రెండేళ్ల క్రితమే మ్యాక్స్ వెల్, విని రామన్‌తో నిశ్చితార్థం జరిగింది. అయితే వీరిద్దరి పెళ్లి వెడ్డింగ్ కార్డు ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పెళ్లి శుభలేఖను తమిళంలో ప్రింట్ చేయించారు.

Glenn Maxwell Set To Marry Indian Origin Fiance, Wedding Card Printed In Tamil Goes Viral (2)

ఈ వెడ్డింగ్ కార్డును సినీనటి కస్తూరి శంకర్ (Kasturi Shankar) షేర్ చేయడంతో నెట్టింట వైరల్ గా మారింది. ‘గ్లెన్‌ మాక్స్‌వెల్ విని రామన్‌ని వివాహం చేసుకోబోతున్నాడు. అందమైన సాంప్రదాయ తమిళ ముహూర్తన వీరిద్దరూ ఒకటి కానున్నారు. తాంబ్రం వేడుక కూడా జరిగే అవకాశం ఉంది.. గ్లెన్, వినీలకు అభినందనలు అంటూ కస్తూరి పోస్టు చేసింది. 2020లోనే మాక్స్‌వెల్ విని నిశ్చితార్థం జరిగింది. ఈ జంట చాలా కాలంగా డేటింగ్‌లో ఉన్నారు. 2017 నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. మెంటోన్ గర్ల్స్ సెకండరీ కాలేజీ నుంచి మెడికల్ సైన్స్ వినీ పూర్తి చేసింది. మెల్బోర్న్‌లో ఫార్మసిస్ట్ గా ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఓ నివేదిక తెలిపింది. భారత సంతతికి చెందిన వినీ తల్లిదండ్రులు చాలా ఏళ్ల క్రితమే ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. విని రామన్ అక్కడే పుట్టి పెరిగారు. ఆమె ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్నారు.


4 ఏళ్ల కిందటే గ్లెన్ మాక్స్ వెల్ తో విని ప్రేమలో పడింది. వీరిద్దరికీ వివాహానికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెళ్లి ముహూర్తం పెట్టేశారు. మ్యాక్స్ వెల్ రెండేళ్ల క్రితం తాను ప్రేమించిన ప్రేయసికి ఉంగరం తొడిగి ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాడు. ఆ ఫొటోలను కూడా మ్యాక్స్ వెల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ సందర్భంగా కాబోయే భార్యతో దిగిన ఫొటోను కూడా అభిమానులతో మ్యాక్స్ వెల్ పంచుకున్నాడు. ఆస్ట్రేలియా క్రికెట్‌ అవార్డుల ప్రదానోత్సవానికి వీరిద్దరూ కలిసివచ్చారు. అప్పటినుంచి వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే విషయం వెలుగులోకి వచ్చింది.

 

View this post on Instagram

 

A post shared by VINI (@vini.raman)

మాక్స్‌వెల్ 2022 సీజన్‌కు ముందు RCB మూడు రిటెన్షన్‌లలో ఒకడిగా ఉన్నాడు. ఇటీవల జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలంలో లేడు.. ఒకవేళ ఉంటే.. అతడు రూ. 11 కోట్లు పలికేవాడు. IPL 2021 పర్పుల్ క్యాప్ విజేత హర్షల్ పటేల్, శ్రీలంక ఆల్ రౌండర్ వనిందు హసరంగాల కోసం RCB వేలంలో పెద్ద మొత్తంలోనే ఖర్చు పెట్టింది. వెటరన్ సౌత్ ఆఫ్రికన్ బ్యాటర్ ఫాఫ్ డు ప్లెసిస్‌తో పాటు మాక్స్‌వెల్ ఆస్ట్రేలియన్ జోష్ హేజిల్‌వుడ్ కూడా ఫ్రాంచైజీలో చేరనున్నాడు. మాక్స్‌వెల్ IPL 2021కి ముందు RCBలో ఉన్నాడు.  15 గేమ్‌లలో 144.10 స్ట్రైక్ రేట్‌తో మ్యాక్స్ వెల్ 513 పరుగులు చేశాడు. ప్రస్తుతం శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మాక్స్‌వెల్ ఆస్ట్రేలియా తరఫున ఆడుతున్నాడు.

Glenn Maxwell Set To Marry Indian Origin Fiance, Wedding Card Printed In Tamil Goes Viral (1)

Read Also : ఇండియా అమ్మాయితో పెళ్లికి రెడీ అయిన మ్యాక్స్ వెల్!