Anushka Sharma : కోహ్లీ కూతురికి అత్యాచార బెదిరింపులు!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూతురు వామికకు అత్యాచార బెదిరింపులు రావడం సంచలనంగా మారింది.

Kohli
Anushka Sharma’s Daughter : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూతురు వామికకు అత్యాచార బెదిరింపులు రావడం సంచలనంగా మారింది. టీ-20ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఓడిపోవడానికి షమి కారణమని ట్రోలింగ్ జరగగా దానిని విరాట్ ఖండించాడు. దీంతో విరాట్ కోహ్లీ- అనుష్క శర్మలపై దూషణలకు దిగాడు ఓ యూజర్. వారి కూతురుని అత్యాచారం చేస్తానంటూ కామెంట్ పెట్టాడు. క్రిక్ క్రేజీ గర్ల్ అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆ కామెంట్ చేశాడు. దానిపై చాలామంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అతడు ట్విట్టర్ అకౌంట్‌ను డిలీట్ చేశాడు.
Read More : Badvel By Poll: పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు..వైసీపీ అభ్యర్థి లీడ్
కోహ్లీ కూతురిని ఉద్దేశించి ఇంత దారుణంగా మాట్లాడిన దుండగుడిది పాకిస్తాన్ అని తొలుత ప్రచారం జరిగింది. కానీ ఫ్యాక్ట్ చెకర్, ప్రఖ్యాత ఆల్ట్ న్యూస్ కో-ఫౌండరైన మొహ్మద్ జుబేర్ మాత్రం ఆ దుండగుడిది హైదరాబాదే అని తేల్చేశారు. క్రిక్ క్రేజీ గర్ల్స్, రమన్ హెయిస్ట్, పెళ్లికూతురుహిరయ్ అనే పేర్లు గల ట్విటర్ అకౌంట్లతో ట్రోలింగ్ కు పాల్పడుతోన్న వ్యక్తి ఒకడేనని, ఆ మూడు అకౌంట్లకు డేటా యూజర్ ఐడీ ఒకటేనని, ఆ వ్యక్తి హైదరాబాద్ కు చెందినవాడేనని జుబేర్ పేర్కొన్నారు. దుండగుడిది హైదరాబాదే అని వెల్లడైన తర్వాత అతను ట్విటర్ అకౌంట్లను డిలీట్ చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఇప్పటిదాకా ఎలాంటి ఫర్యాదు నమోదుకాలేదు.
Read More : Counting Of Votes : బద్వేల్ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్ ప్రారంభం
ఈ బెదిరింపు ట్వీట్‌పై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమాముల్ హక్ సహా పలువురు స్పందించారు. కోహ్లీని, అతడి కుటుంబాన్ని టార్గెట్ చేస్తుండడాన్ని తీవ్రంగా ఖండించారు. సహచరుడైన ముస్లింకు అండగా నిలబడినందుకే కోహ్లీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులు వస్తున్నాయని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు.