పాక్‌పై యుద్ధం ఎలా ఉంది.. ఫేస్‌బుక్‌లో కోహ్లీ కామెంట్

యావత్ భారతమంతా.. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకున్నామంటూ సగర్వంగా చెప్పుకుంటోంది. వీరిలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ.. చేరిపోయాడు. ఇటీవల బాలీవుడ్‌లో సర్జికల్ స్ట్రైక్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ‘ఉరి’. అందులో ఉన్న ఓ డైలాగ్ ‘హౌజ్ ద జోష్’ జోష్ ఎలా ఉంది.. తో కోహ్లీ ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు. సాధారణంగా ఆ సినిమా చూసిన వాళ్లకు తప్ప ఆ కామెంట్ గురించి ఎవ్వరికీ తెలియకపోవచ్చు. 

2019 ఫిబ్రవరి 26 మంగళవారం ఉదయం 3.30నిమిషాలకు భారత యుద్ధ విమానాలు పాక్ సరిహద్దులు దాటి పాక్ లోని ఉగ్రవాద క్యాంపులపై దాడి చేశాయి. ఆ తర్వాతే కోహ్లీ ఈ కామెంట్ పెట్టాడు. అయితే ఆ కామెంట్ ను టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోతో కలిపి పోస్టు చేసేశాడు. అంటే శ్రుతిలో కలిపేశాడన్నమాట. 

భారత్ సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తలపడుతోన్న తరుణంలో వైజాగే వేదికగా జరిగిన తొలి టీ20ని ఇప్పటికే ముగించుకుంది. రెండో టీ20ని బెంగళూరు వేదికగా ఆడేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను 1-1గా ముగించాలని టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సాయంత్రం 7గంటలకు మ్యాచ్ మొదలుకానుంది. దీని తర్వాత తొలి వన్డేను మార్చి 2వ తేదీ హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో ఆడనుంది.