Virat Kohli : స‌హ‌నం కోల్పోయిన కోహ్లీ.. బాక్స్ పై ప్ర‌తాపం.. వీడియో వైర‌ల్‌

రెండో ఇన్నింగ్స్‌లో ఔట్ అయిన త‌రువాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెలుతూ కోహ్లీ చేసిన ప‌ని ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

Virat Kohli loses his cool as he smashes ice box after getting dismissed in pune test

పూణే వేదిక‌గా జ‌రిగిన రెండో టెస్టులో భార‌త్ ఓడిపోయింది. దీంతో మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే భార‌త్ టెస్టు సిరీస్‌ను చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ విఫ‌లం అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఔట్ అయిన త‌రువాత డ్రెస్సింగ్ రూమ్‌కు వెలుతూ కోహ్లీ చేసిన ప‌ని ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.

359 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగింది భార‌త్‌. ఇన్నింగ్స్ 29 ఓవ‌ర్‌ను మిచెల్ శాంట్న‌ర్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని చివ‌రి బంతిని కోహ్లీ డిఫెన్స్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. అయితే.. బ్యాట్‌ను మిస్సైన బంతి ప్యాడ్ల‌ను తాకింది. కివీస్ ప్లేయ‌ర్లు అప్పీల్ చేయ‌గా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు.

Yashasvi Jaiswal : సిక్స‌ర్ల కింగ్ య‌శ‌స్వి జైస్వాల్ .. 92 ఏళ్ల భార‌త టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు

వెంట‌నే కోహ్లీ రివ్యూని తీసుకున్నాడు. బంతి లెగ్‌స్టంప్‌ను మిస్ అవుతుంద‌ని కోహ్లీ భావించాడు. అయితే.. రిప్లేలో బంతి లెగ్ స్టంప్‌ను వికెట్ల‌కు బ‌య‌ట వైపు నుంచి లైట్‌గా తాకుతున్న‌ట్లుగా క‌నిపించింది. దీంతో అంపైర్స్ కాల్‌తో ఔట్ అంటూ థ‌ర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. దీంతో అంపైర్‌ను కోపంగా చూసుకుంటూ విరాట్ కోహ్లీ మైదానాన్ని వీడాడు.

ఇక డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే దారిలో ప‌క్క‌న ఉన్న ఐస్‌బాక్స్‌ను త‌న కోపాన్ని నియంత్రించుకోలేని కోహ్లీ త‌న బ్యాట్‌తో కొట్టాడు. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే చేసిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో 17 ప‌రుగుల‌కే పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు.

WTC Final 2024: టీమిండియా డబ్ల్యూటీసీ ఫైన‌ల్‌కు చేరాలంటే ఇంకా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలి.. సమీకరణలు ఇలా..

మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ మొద‌టి ఇన్నింగ్స్‌ల్లో 259 ప‌రుగులు చేసింది. అనంత‌రం భార‌త్ తొలి ఇన్నింగ్స్‌లో 156 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో కివీస్‌కు 103 ప‌రుగుల ఆధిక్యం ల‌భించింది. ఇక‌ రెండో ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 255 ప‌రుగుల‌కు ఆలౌటైంది. భార‌త్ ముందు 359 ప‌రుగుల భారీ ల‌క్ష్యం నిల‌వ‌గా 245 కే టీమ్ఇండియా ఆలౌటైంది. దీంతో కివీస్ 113 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.