Virat Kohli on 71st century
Virat Kohli On 71st Ton: ప్రతీ క్రికెటర్ తన కెరీర్‌లో గడ్డురోజులను ఖచ్చితంగా ఎదుర్కొంటాడు. ఇందుకు పరుగుల యంత్రం, రికార్డుల రారాజు, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి(Virat Kohli) కూడా ఏమీ అతీతుడు కాదు. విరాట్ తన కెరీర్‌లో 2019 నవంబర్ నుంచి దాదాపు మూడేళ్ల పాటు ఒక్కటంటే ఒక్క శతకాన్ని కొట్టలేదు. ఒకనొక సమయంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) వంద శతకాల రికార్డును ఈజీగా విరాట్ కోహ్లి బ్రేక్ చేస్తాడని చాలా మంది బావించారు. అయితే..కోహ్లి ఇలా మూడు సంవత్సరాల పాటు శతకం లేకుండా ఉండిపోతాడని కలలో కూడా ఎవరూ ఊహించి ఉండరు.
మూడేళ్ల పాటు సెంచరీ చేయకపోవడంతో విరాట్‌పై చాలా మంది విమర్శలు చేశారు. కొందరైతే కోహ్లి పనైపోయింది.. ఇక ఆటకు వీడ్కోలు చెప్పే సమయం ఇదే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెట్టారు. విరాట్ స్థానంలో వేరొకరు ఉండి ఉంటే ఆటకు గుడ్ బై చెప్పేవారే. కానీ కోహ్లి అలా కాదు కదా. అందుకనే నెల రోజుల పాటు క్రికెట్‌కు కాస్త విరామం ఇచ్చాడు. అనంతరం ఆసియా కప్‌లో నిరీక్షణకు తెరదించుతూ సెప్టెంబర్ 2022లో అఫ్గానిస్థాన్‌పై శతకం చేశాడు.
Virat Kohli: జైస్వాల్‌ను ప్రశంసిస్తూ కోహ్లి పోస్ట్.. కాసేపటికే డిలీట్.. అసలు సంగతి ఇదే..?
టీ20 ఫార్మాట్‌లో కోహ్లి కి ఇది తొలి సెంచరీ కాగా తన కెరీర్‌లో మొత్తంగా 71వ అంతర్జాతీయ శతకం. దీంతో అతడిపై ఉన్న భారం అంతా దిగిపోయింది. ఆ తరువాత వన్డేల్లో వెను వెంటనే సెంచరీలు బాదేశాడు. అయితే.. ఆ సెంచరీ కొట్టినప్పుడు తన మనసులో ఎలాంటి భావోద్వేగాలు ఉన్నాయో తాజాగా కోహ్లి వెల్లడించాడు. ‘లెట్ దేర్ బి స్పోర్ట్’ అనే కార్యక్రమంలో ఆ సెంచరీ విరాట్ గుర్తు చేసుకున్నాడు.
“ఆ రోజు నేను 94 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు ఒక్కటే అనుకున్నాను. ఈ రోజు ఎలాగైనా శతకం చేయాలని బావించా. ఆ తరువాత బంతికి సిక్స్ కొట్టడంతో సెంచరీ పూరైంది. ఆ సమయంలో నేను భారంగా(దుఃఖం, ఆనందం కలగలిసిన) నవ్వేశాను. ఎందుకంటే రెండు సంవత్సరాలుగా నేను దీని కోసమా ఏడ్చింది.” అని అనిపించిందని విరాట్ కోహ్లి అన్నాడు.
Virat Kohli Letter BCCI: నేను చేసిన తప్పేంటి.. భారీ జరిమానాపై బీసీసీఐకి లేఖ రాసిన విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో 75 సెంచరీలు చేశాడు. వన్డేల్లో 46, టెస్టుల్లో 28 టీ20ల్లో 1 శతకం అతడి పేరు మీదున్నాయి. సచిన్ వంద శతకాలు అందుకోవడానికి 25 సెంచరీల దూరంలో ఉన్నాడు. అయితే.. వన్డేల్లో మరో నాలుగు సెంచరీలు చేస్తే మాత్రం సచిన్(49 సెంచరీలు) రికార్డును విరాట్ అధిగమించనున్నాడు. ఈ సంవత్సరమే విరాట్ ఈ ఘనత సాధించే అవకాశం ఉంది. ఆసియా కప్ తో పాటు వన్డే వరల్డ్ కప్ ఉండడంతో విరాట్‌కు ఇది పెద్ద కష్టం కాదని క్రికెట్ పండితులు పేర్కొంటున్నాడు.