కోహ్లీకి వార్నింగ్ ఇచ్చి మరీ అవుట్ చేశాడు

కోహ్లీకి వార్నింగ్ ఇచ్చి మరీ అవుట్ చేశాడు

Updated On : April 3, 2019 / 5:17 AM IST

ఐపీఎల్ సీజన్ 12 ఆరంభమైనప్పటి నుంచి వరుస తప్పిదాలతో కోహ్లీ పేలవంగా అవుట్ అవుతున్నాడు. బెంగళూరు కెప్టెన్‌ను తప్పించడంతో ఆ జట్టు వరుసగా 4 మ్యాచ్‌లలోనూ వైఫల్యాన్ని చవి చూసింది. రాజస్థాన్ వేదికగా జరిగిన బెంగళూరు వర్సెస్ రాజస్థాన్ లోనూ ఇదే తరహాలో కోహ్లీ అవుట్ అయ్యాడు. రాజస్థాన్ బౌలర్ వార్నింగ్ ఇచ్చి మరీ కెప్టెన్‌ను పెవిలియన్ బాట పట్టించాడు. 

లెగ్ స్పిన్నర్ శ్రేయాస్ గోపాల్ బెంగళూరు ఇన్నింగ్స్‌లో 7వ ఓవర్ బౌలింగ్‌ చేస్తున్నాడు. రెండో బంతిని గూగ్లీ వేశాడు. దానిని డిఫెన్స్ చేయడానికి కోహ్లీ చాలా కష్టపడితే బ్యాట్ ఎడ్జ్‌కి తాకింది. అప్పటికీ రాజస్థాన్ బౌలర్లు ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్ చేయగా అంపైర్ తిరస్కరించాడు. దక్కిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేని కోహ్లీ తర్వాతి బంతికే అవుట్ అయ్యాడు. అదే తరహాలో తర్వాతి బంతిని సంధించాడు శ్రేయాస్ గోపాల్. 

దానిని అంచనా వేయడంలో విరాట్ కోహ్లీ పొరబడ్డాడు. మరోసారి డిఫెన్స్ చేద్దామని ప్రయత్నించే లోపే బంతి నేరుగా బ్యాడ్జ్‌ను తాకుతూ వికెట్లను పడగొట్టింది. ఫలితంగా కోహ్లి (23: 25 బంతుల్లో 3ఫోర్లు) క్లీన్ బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్.. బెంగళూరుపై 7 వికెట్ల తేడాతో  గెలుపొందింది.