ICC World Cup 2023: బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ

విరాట్ కోహ్లీ భారత్ జట్టు తరపున వికెట్ కీపర్ కానీ వ్యక్తిగా అత్యధిక క్యాచ్ లను పూర్తిచేశాడు. అయితే, డ్రసింగ్ రూంలో కోహ్లీ ఉత్తమ ఫీల్డర్ అవార్డు అందుకుంటున్న వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.

ICC World Cup 2023: బెస్ట్ ఫీల్డర్ అవార్డు అందుకున్న విరాట్ కోహ్లీ.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ

Virat Kohli

Updated On : October 9, 2023 / 11:06 AM IST

virat kohli : క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం అత్యుత్తమ ఫీల్డర్లలో టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒకరని అనడంలో సందేహం లేదు. ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ ఆ విషయాన్ని మరోసారి రుజువుచేశాడు. మొదటి స్లిప్ లో అద్భుతమైన క్యాచ్ అందుకోవటమే కాకుండా, ఔట్ ఫీల్డ్ లో కోహ్లీ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ క్రమంలో చెన్నైలో జరిగిన మ్యాచ్ తరువాత డ్రసింగ్ రూంలో భారత జట్టు మేనేజ్ మెంట్ ఉత్తమ ఫీల్డర్ గా విరాట్ కోహ్లికి అవార్డును అందించింది.

Read Also : ODI World Cup 2023: ఆ ఒక్క క్యాచ్ వదిలేసి.. భారత్ విజయానికి బాటలు వేసిన ఆసీస్.. వీడియో వైరల్

విరాట్ కోహ్లీ భారత్ జట్టు తరపున వికెట్ కీపర్ కానీ వ్యక్తిగా అత్యధిక క్యాచ్ లను పూర్తిచేశాడు. అయితే, డ్రసింగ్ రూంలో కోహ్లీ ఉత్తమ ఫీల్డర్ అవార్డు అందుకుంటున్న వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఇదిలాఉంటే ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టు విజయంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కీలక భూమిక పోషించారు.