Virat Kohli: కోహ్లి రికార్డుల వేట.. సచిన్ రికార్డ్ బ్రేక్
విరాట్ కోహ్లి రికార్డుల పర్వం కొనసాగుతోంది. తాజాగా వన్డేల్లో మరో రికార్డు క్రియేట్ చేసి సత్తా చాటాడు కింగ్ కోహ్లి.

Virat Kohli Photo Credit: @BCCI
Virat Kohli ODI Record: టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లి రికార్డుల వేట కొనసాగుతోంది. వన్డేల్లో తాజాగా మరో రికార్డు సృష్టించాడు. దిగ్గజ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ ను అధిగమించి మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. వన్డేల్లో అత్యధికసార్లు కేలండర్ ఇయర్ లో 1000 ప్లస్ స్కోర్లు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ లో భాగంగా ముంబై వాంఖడే స్టేడియంలో గురువారం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్ లో విరాట్ కోహ్లి ఈ ఘనత సాధించాడు.
విరాట్ కోహ్లి కేలండర్ ఇయర్ లో 8 సార్లు 1000 ప్లస్ స్కోర్లు చేశాడు. సచిన్ టెండూల్కర్ ఏడు సార్లు ఈ ఘనత సాధించాడు. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ రికార్డును కింగ్ బద్దలు కొట్టాడు. కాగా, తాజా మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేసి శతకం దిశగా కోహ్లి దూసుకెళ్తున్నాడు. ఇప్పటివరకు వన్డేల్లో 70 హాఫ్ సెంచరీలు బాదాడు. శ్రీలంకపై కోహ్లికి ఇది 12వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
వన్డే ప్రపంచకప్ లో అత్యధిక పర్యాయాలు 50 ప్లస్ స్కోరు చేసిన ప్లేయర్ల లిస్టులో కోహ్లి రెండో స్థానానికి చేరుకున్నాడు. సచిన్ టెండూల్కర్(21) అందరి కంటే ముందున్నాడు. రోహిత్ శర్మ(12), షకీబ్ అల్ హసన్(12), కుమార సంగక్కర(12) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. సచిన్ 44 ఇన్నింగ్స్ లో 21 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేశాడు. కోహ్లి 33 ఇన్నింగ్స్ లో 13 పర్యాయాలు 50 ప్లస్ స్కోర్లు సాధించాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 24 ఇన్నింగ్స్ లోనే 12 సార్లు 50 ప్లస్ స్కోర్లు నమోదు చేశాడు. సంగక్కర, షకీబ్ 35 ఇన్నింగ్స్ ఆడారు.
Also Read: ఆ రెండు జట్లకు కలిసొచ్చిన న్యూజిలాండ్ ఓటమి.. సెమీస్ లోకి పాకిస్థాన్ ఎంట్రీ ఖాయమా?