Vamika : బిడ్డ ఫొటో వైరల్ కావడంపై విరాట్-అనుష్క స్పందన

ఎన్నడూ వామిక ఫొటోలను కోహ్లీ-అనుష్క షేర్ చేయలేదు. ఐతే.. అనుకోకుండా..

Vamika : బిడ్డ ఫొటో వైరల్ కావడంపై విరాట్-అనుష్క స్పందన

Virat Kohli Anushka Sharma Vamika Insta Story Photo

Updated On : January 24, 2022 / 1:03 PM IST

Vamika : టీమిండియా ఏస్ క్రికెటర్, మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)– అనుష్క శర్మ(Anushka Sharma)ల ముద్దుల కూతురు వామిక(Vamika) ఫొటో, వీడియో వైరల్ అవుతున్నాయి. సౌతాఫ్రికాతో థర్డ్ వన్డేలో హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీని కంగ్రాచ్యులేట్ చేస్తూ స్టాండ్స్ దగ్గర అనుష్క శర్మ చప్పట్లు కొడుతున్న టైంలో.. కెమెరాను అనుష్కవైపు ప్యాన్ చేశాడు అక్కడున్న వీడియో గ్రాఫర్. Unexpectedగా పాప కూడా వీడియోలో రికార్డైంది. ఆ సమయానికి వామికను అనుష్క ఎత్తుకుని ఉండటంతో.. పాప ఎలా ఉంటుందో అందరికీ తెలిసిపోయింది. పాప ఫొటో, వీడియో ఇపుడు సోషల్ మీడియా(Social Media)లో వైరల్ కావడంపై విరాట్ కోహ్లీ తన ఇన్ స్టాగ్రామ్(Instagram) స్టోరీలో స్పందించాడు.

Read This : DJ Tillu : ‘ఐటం రాజా.. క్రేజీ రోజా’.. అనిరుధ్ మరో చార్ట్ బస్టర్..

నిజానికి, జన్మనిచ్చినప్పుడే తమ బిడ్డ ప్రైవసీని అందరూ కాపాడాలని విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీ ఫొటో గ్రాఫర్ల(paparazzi)కు విజ్ఞప్తిచేశారు. ఫొటోగ్రాఫర్లు, వీడియో గ్రాఫర్లకు అవసరమైన కంటెంట్ ను తాము ఇస్తామని.. ఐతే.. ఇదే సమయంలో తమ కూతురు ఫొటోలు, వీడియోలు మాత్రం ఎవరూ బయట ప్రపంచంలో లీక్ చేయొద్దని విరాట్ మొదట్లోనే కోరారు. విరుష్క జంట రిక్వెస్ట్ ను అంగీకరిస్తూ.. ఫొటో-వీడియో గ్రాఫర్లు కూడా ఎక్కడా ఆ పాప ఫొటోను పబ్లిష్ చేయలేదు. సోషల్ మీడియాలోనూ.. ఎన్నడూ వామిక ఫొటోలను కోహ్లీ-అనుష్క షేర్ చేయలేదు. ఐతే.. అనుకోకుండా వీడియోలో పాప కనిపించడంపై విరాట్-అనుష్క కూల్ గా రియాక్టయ్యారు.

Read This : Viashnav Tej : కేతికతో ‘రంగరంగ వైభవంగా’ వైష్ణవ్ తేజ్..

“హాయ్.. గయ్స్.. నిన్న జరిగిన మ్యాచ్ లో మా పాప ఫొటోలు క్యాప్చర్ అయ్యాయని, వైరల్ అయ్యాయని తెలిసింది. మేం కెమెరా మా వైపు ఆన్ లో ఉన్న సంగతి గుర్తించలేదు. మేం పాప విషయంలో మొదట చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నాం. ఇలా జరగకపోయి ఉంటే అందరినీ అభినందించేవాళ్లం. థాంక్యూ” అని ఇద్దరి ఒపీనియన్ ను స్టేటస్ స్టోరీలో ఇచ్చారు.

Virat Kohli Insta Story

Virat Kohli Insta Story