Virat Kohli: మ్యాచ్ గెలవగానే విరాట్ కోహ్లీ చేసిన డ్యాన్స్ అదుర్స్ కదూ..

వెస్టిండీస్ లోని డొమినికాలో జరిగిన ఈ టెస్టు మ్యాచులో కోహ్లీ 76 పరుగులు చేశాడు.

Virat Kohli: మ్యాచ్ గెలవగానే విరాట్ కోహ్లీ చేసిన డ్యాన్స్ అదుర్స్ కదూ..

Virat Kohli

Updated On : July 15, 2023 / 10:33 AM IST

Virat Kohli – IND Vs WI: వెస్టిండీస్‌(West Indies)ను భారత్ (India) చిత్తుగా ఓడించిన ఆనందంలో టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ చేసిన డ్యాన్స్ అదుర్స్ అనిపిస్తోంది. చాలా కూల్ గా కోహ్లీ డ్యాన్స్ చేశాడు. మైదానంలో చేతులు కదిలిస్తూ పైకి చూస్తూ అతడు చేసిన డ్యాన్స్ కి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

వెస్టిండీస్ లోని డొమినికాలో జరిగిన ఈ టెస్టు మ్యాచులో కోహ్లీ 76 పరుగులు చేశాడు. ఈ మ్యాచులో అశ్విన్ ఏడు వికెట్లు తీసి వెస్టిండీస్ బ్యాటర్ల వెన్నువిరిచాడు. దానికి తోడు యశస్వి జైస్వాల్‌ 171, రోహిత్ శర్మ 103 పరుగులతో రాణించడంతో భారత్ ఇన్నింగ్స్, 141 పరుగులతో విజయం సాధించింది.

వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 150 పరుగులకు, రెండో ఇన్నింగ్స్ లో 130 పరుగులకు ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో భారత్ 421/5కి డిక్లేర్ ఇచ్చింది. భారత్ మూడు రోజుల్లోనే భారత్ ఆటను ముగించింది.

IND Vs WI: ఇషాంత్ కిషన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహం.. వీడియో ఇదిగో