Virat Kohli : విరాట్ మరో ఘనత.. 25ఏళ్లలో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ.. వీడియో వైరల్
గూగుల్ విడుదల చేసిన వీడియోలో.. అథ్లెట్ విభాగంలో క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో నిలిచాడు. రొనాల్డో ఫుట్ బాల్ చరిత్రలో అత్యధిక గోల్ఫ్ చేసినవారిలో ఒకడు.

Virat Kohli
Google 25years Virat Kohli : ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ రారాజుగా వెలుగొందుతున్నాడు. క్రికెట్ చరిత్రలో అనేక రికార్డులను బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ తాజాగా మరో ఘనత సాధించాడు. గూగుల్ తన మొత్తం 25ఏళ్ల చరిత్రలో అత్యధికంగా శోధించిన ఘటనలు, వ్యక్తుల జాబితాను విడుదల చేసింది. విభాగాల వారిగా జాబితాతో కూడిన 3.48 నిమిషాల నిడివి కలిగిన వీడియోను రూపొందించింది. ఈ వీడియోలో క్రీడా విభాగంలో క్రికెట్ లో కోహ్లీ స్థానం దక్కించుకున్నాడు.
Also Read : Anushka And Virat Kohli : కోహ్లీ, అనుష్కల వివాహ వార్షికోత్సవ ఫొటోలు వైరల్.. అనుష్కశర్మ ఏమన్నదంటే?
గూగుల్ విడుదల చేసిన వీడియోలో.. అథ్లెట్ విభాగంలో క్రిస్టియానో రొనాల్డో మొదటి స్థానంలో నిలిచాడు. రొనాల్డో ఫుట్ బాల్ చరిత్రలో అత్యధిక గోల్ఫ్ చేసినవారిలో ఒకడు. గూగుల్ లో ఆల్ టైమ్ అత్యధికంగా శోధించిన అథ్లెట్ గా నిలిచాడు. క్రికెట్ విభాగంలో ఆ ఘనత కోహ్లీకి దక్కింది. క్రికెట్ లో కోహ్లీ అనేక రికార్డులను బద్దలు కొట్టాడు. మరోవైపు 2023లో గూగుల్ లో అత్యధికంగా శోధించిన వ్యక్తుల జాబితాలో క్రీడావిభాగంలో శుభ్ మన్ గిల్, రచిన్ రవీంద్ర ఉన్నారు. 2023లో టాప్ ట్రెండింగ్ సెర్చ్ లిస్టు లో ఉన్న కొందరు క్రికెటర్లలో శుభమాన్ గిల్, రచిన్ రవీంద్ర, మహ్మద్ షమీ, గ్లెన్ మాక్స్ వెల్, సూర్యకుమార్ యాదవ్, ట్రావిస్ హెడ్ లు ఉన్నారు.
గూగుల్ విడుదల చేసిన వీడియోలో ఎక్కువ మంది సెర్చ్ చేసిన మూవీ జానర్ గా బాలీవుడ్ అగ్రస్థానంలో ఉంది. గూగుల్ చరిత్రలో అత్యధిక ఎక్కువ మంది వెతికిన ‘మొదటి అడుగు’గా.. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడిపై కాలు మోపిన దృశ్యం నిలిచింది. ఇక, 1980వ దశకం గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది శోధించారట.
https://twitter.com/Google/status/1734218344402743791?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1734218344402743791%7Ctwgr%5E49340018846d14350f5971091615b605bfb9203b%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.latestly.com%2Fsocially%2Fsports%2Fcristiano-ronaldo-most-searched-athlete-virat-kohli-most-searched-cricketer-as-google-reveals-all-time-search-results-5624091.html