Virat Kohli : వన్డే కెప్టెన్‌గా నాలుగేళ్లలో కోహ్లీ రికార్డులు.. అసంతృప్తి మాత్రం ఇదే!
భారత జట్టుకి కొత్త వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లి స్థానంలో జట్టు బాధ్యతలను తీసుకున్నాడు రోహిత్ శర్మ.

Kohli
Virat Kohli: భారత జట్టుకి కొత్త వన్డే కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. విరాట్ కోహ్లి స్థానంలో జట్టు బాధ్యతలను తీసుకున్నాడు రోహిత్ శర్మ. అంతకుముందు, కోహ్లి T20 ఫార్మాట్ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకోగా.. ఆ తర్వాత T20కి నాయకత్వం వహించే అవకాశం రోహిత్‌కు లభించింది. ఇప్పుడు వన్డేలు, టీ20ల్లో టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ ఉండబోతున్నాడు.
అయితే, టెస్టు క్రికెట్‌లో మాత్రం కోహ్లీ కెప్టెన్‌గా ఉన్నాడు. కెప్టెన్‌గా వన్డే ఫార్మాట్‌లో కోహ్లి ప్రయాణం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా వన్డే రికార్డు:
2017లో భారత జట్టు వన్డే కెప్టెన్సీని మహేంద్ర సింగ్ ధోనీ నుంచి అందుకున్నాడు విరాట్ కోహ్లీ. అప్పటి నుంచి జట్టు తరపున 95వన్డే మ్యాచ్‌లు ఆడారు. అందులో 65 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించగా.. భారత్ 27 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. సొంతగడ్డపై కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా 35వన్డేలు ఆడగా, అందులో 24 మ్యాచ్‌లు గెలిచింది. విదేశాల్లో కూడా కోహ్లీ కెప్టెన్సీలో భారత్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. విదేశాల్లో కోహ్లీ సారథ్యంలో టీమిండియా మొత్తం 42 వన్డేలు ఆడగా.. 29 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. 11 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది.
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు మొత్తం 19 వన్డేల సిరీస్‌లలో పాల్గొంది. ఇందులో 15 సిరీస్‌లను కైవసం చేసుకుంది. దీంతో టీమ్ ఇండియా అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడుగా నిలిచాడు కోహ్లీ.
ఐసీసీ టోర్నీల్లో విఫలమైన కెప్టెన్‌గా కోహ్లీ:
వన్డే క్రికెట్‌లో కెప్టెన్‌గా విరాట్‌కు ఎన్నో రికార్డులు ఉన్నప్పటికీ, ప్రధాన ఐసీసీ టోర్నీల్లో మాత్రం కెప్టెన్సీ పూర్తిగా ఫ్లాప్ అయింది. 2019లో ఆడిన వన్డే ప్రపంచకప్‌లో, సెమీ-ఫైనల్‌కు చేరిన తర్వాత జట్టు బయటకు వచ్చేసింది. 2013-14 ఆసియా కప్‌లో కూడా ధోనీ గైర్హాజరీలో కోహ్లీని కెప్టెన్‌గా నియమించినా అక్కడ కూడా జట్టు ప్రదర్శన నిరాశపరిచింది. ఏ ఐసీసీ ట్రోఫీని గెలవనందుకు కోహ్లీ ఎప్పుడూ అసంతృప్తితో ఉంటాడు.