IPL 2019 : విశాఖ వేదికగా రెండు ప్లే ఆఫ్ మ్యాచ్‌లు
ఐపీఎల్ 2019 సీజన్ లో భాగంగా జరుగబోయే ప్లే ఆఫ్ మ్యాచ్ లకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది.

ఐపీఎల్ 2019 సీజన్ లో భాగంగా జరుగబోయే ప్లే ఆఫ్ మ్యాచ్ లకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది.
ఐపీఎల్ 2019 సీజన్ లో భాగంగా జరుగబోయే ప్లే ఆఫ్ మ్యాచ్ లకు విశాఖపట్నం ఆతిథ్యం ఇవ్వనుంది. విశాఖ వేదికగా మే 8, మే 10న రెండు ప్లే ఆఫ్ మ్యాచ్ లు జరుగనున్నాయి. ఆంధ్రా క్రికెట్ అసిసోయేషన్ మంగళవారం (ఏప్రిల్ 23, 2019) ప్రెస్ రిలీజ్ లో వెల్లడించింది.
Also Read : ఆయనకు ముద్దు పెడతావా : ధోనీ భార్యపై నెటిజన్లు ఫైర్
ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం.. ప్లే ఆఫ్ మ్యాచ్ లు చెన్నైలో జరగాల్సి ఉంది. అనుకోని అవాంతరాల కారణంగా రెండు ప్లే మ్యాచ్ లను విశాఖపట్నానికి అత్యవసరంగా తరలించాల్సిన అవసరం ఏర్పడినట్టు ఏసీఏ జనరల్ సెక్రటరీ సిహెచ్ అరుణ్ కుమార్ తెలిపారు.
ఇటీవల ఐపీఎల్ అధికారులు విశాఖలోని YSR-ACA క్రికెట్ స్టేడియాన్ని సందర్శించారని, అక్కడి ప్లే ఆఫ్ మ్యాచ్ లు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయా అనేదానిపై దగ్గరుండి సమీక్షించి వెళ్లినట్టు ఆయన చెప్పారు. స్టేడియంలోని మైదానం కండీషన్ అద్భుతంగా ఉందని, ఐపీఎల్ మ్యాచ్ లను నిర్వహించేందుకు అన్ని సౌకర్యాలు ఉన్నట్టు ఏసీఏ జనరల్ సెక్రటరీ తెలిపారు.
Also Read : వేలంలో నన్నేవరూ కొనరు : అదో ట్రేడ్ సీక్రెట్.. CSK సక్సెస్ మంత్రా చెప్పను
విశాఖపట్నం అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంగా 2016లో ఐపీఎల్ మ్యాచ్ లకు ఆతిథ్యమిచ్చింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ లను నిర్వహించేందుకు మహారాష్ట్ర హైకోర్టు నిషేధం విధించడంతో ఆయా మ్యాచ్ లను విశాఖపట్నానికి తరలించారు. అప్పటినుంచి విశాఖ ఐపీఎల్ మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తోంది.
Also Read : ప్లే ఆఫ్ మ్యాచ్ లకు వేదికగా చెన్నై చెపాక్ స్టేడియం