IND vs NED : టీమ్ఇండియా వార్మప్ మ్యాచులు వర్షార్పణం.. నెదర్లాండ్స్‌తో మ్యాచ్ కూడా..
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.

pic @ BCCI Twitter
IND vs NED Warm up match : వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరగాల్సిన వార్మప్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అంతకముందు వర్షం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమవుతుందని ప్రకటించారు. మధ్యలో వరుణుడు కాస్త కరుణించడంతో మైదానంలోని కవర్లు తొలగించి మ్యాచ్‌కు గ్రౌండ్‌ను సిద్ధం చేస్తుండగా మళ్లీ వరుణుడు వచ్చేశాడు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు. కాగా..టీమ్ఇండియా ఆడాల్సిన రెండు వార్మప్ మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కావడం గమనార్హం.
ప్రపంచకప్‌లో పాల్గొనన్న 10 జట్లలో ఒక్క టీమ్ఇండియా మాత్రమే ఒక్క వార్మప్ మ్యాచ్ ఆడకుండా నేరుగా ప్రపంచకప్ బరిలోకి దిగనుంది. ఇది టీమ్ఇండియాకు డిస్ అడ్వాండేజ్‌గా మారే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియాతో అమీతుమీ..
వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్ ను అక్టోబర్ 8 న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసే భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అక్టోబర్ 14న జరగనుంది. ఈ మ్యాచ్‌కు గుజరాత్ రాష్ట్రంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఆతిథ్యం ఇవ్వనుంది.
వన్డే ప్రపంచకప్ కు భారత జట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.
UPDATE: The warm-up match between India & Netherlands is abandoned due to persistent rain. #TeamIndia | #CWC23 https://t.co/rbLo0WHrVJ pic.twitter.com/0y4Ey1Dvye
— BCCI (@BCCI) October 3, 2023