ODI World Cup 2023 : 1987లో జ‌న్మించిన కెప్టెన్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 విజేత‌.. సైంటిఫిక్ జ్యోతిష్కుడు గ్రీన్‌స్టోన్ లోబో..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) 2023 మ‌రో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఈ మెగాటోర్నీలో మొత్తం 10 జ‌ట్లు క‌ప్పుకోసం పోటీ ప‌డ‌నున్నాయి.

ODI World Cup 2023 : 1987లో జ‌న్మించిన కెప్టెన్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 విజేత‌.. సైంటిఫిక్ జ్యోతిష్కుడు గ్రీన్‌స్టోన్ లోబో..

Greenstone Lobo predicts winner of Cricket world cup 2023

Updated On : October 3, 2023 / 2:44 PM IST

ODI World Cup 2023 winner : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ (ODI World Cup) 2023 మ‌రో రెండు రోజుల్లో ఆరంభం కానుంది. అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న ఈ మెగాటోర్నీలో మొత్తం 10 జ‌ట్లు క‌ప్పుకోసం పోటీ ప‌డ‌నున్నాయి. రౌండ్ రాబిన్‌-నాకౌట్ ప‌ద్ద‌తిలో మెగాటోర్నీ జ‌ర‌గ‌నుంది. ఈ సారి ప్ర‌పంచ‌క‌ప్‌ను ఎవ‌రు గెలుస్తారు అనే దానిపై అంద‌రిలో ఆస‌క్తి నెల‌కొంది. స్వ‌దేశంలో ప్ర‌పంచ‌క‌ప్ జ‌రుగుతుండ‌డంతో టీమ్ఇండియా విజేత‌గా నిల‌వాల‌ని స‌గ‌టు భార‌తీయుడు కోరుకుంటున్నాడు.

కాగా.. ఈ సారి వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను ఎవ‌రు గెలుస్తారో ప్ర‌ముఖ సైంటిఫిక్ జ్యోతిష్యుడు గ్రీన్‌స్టోన్ లోబో చెప్పారు. 1987వ సంవ‌త్స‌రంలో జ‌న్మించిన కెప్టెన్ అయిన రోహిత్ శ‌ర్మ నేతృత్వంలోని భార‌త జ‌ట్టు గెలుస్తుంద‌ని జోస్యం చెప్పాడు. 1986లో జన్మించిన క్రీడాకారులు,1987లో జన్మించిన కెప్టెన్‌లు ఇటీవల ప్రధాన క్రీడా ఈవెంట్‌లలో విజయం సాధించారు అన్న విష‌యాల‌ను తెలియ‌జేస్తూ అత‌డు ఈ విష‌యాన్ని చెప్పాడు.

నివేదికల ప్రకారం.. లోబో 2011, 2015, 2019 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ల విజేతలను ఖచ్చితంగా అంచనా వేశారు. దీంతో ఈ సారి కూడా అత‌డు చెప్పింది జ‌రుగుతుంద‌ని కొంద‌రు నెటీజ‌న్లు అంటున్నారు. అదే జ‌రిగితే అంత‌కంటే కావాల్సింది ఇంకా ఏమి ఉండ‌ద‌ని, 12 ఏళ్ల క‌రువు తీరుతుంద‌న్నారు. మ‌రికొంద‌రు మాత్రం అతడు చెప్పివ‌న్నీ జ‌ర‌గ‌వ‌ని అంటున్నారు.

Asian Games 2023: జాతీయ గీతాలాపన సమయంలో కన్నీరు పెట్టుకున్న యువ క్రికెటర్.. వీడియో వైరల్

టైమ్స్ ఆఫ్ ఇండియాలోని ఓ క‌థ‌నంలో లోబో ఇలా చెప్పాడు. రాఫెల్ నాదల్‌ను అధిగమించిన టెన్నిస్ సూపర్‌స్టార్ నోవాక్ జొకోవిచ్ 1987లో జన్మించాడని, నాదల్ 1986లో జన్మించాడని, అలాగే.. 2018 FIFA ప్రపంచ కప్‌ను హ్యూగో లోరిస్ (2018 FIFA వరల్డ్ కప్) ఫ్రాన్స్ గెలుచుకున్నాడని జ్యోతిష్కుడు సూచించాడు . 2022లో ఇటీవల జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌ను అర్జెంటీనా లియోనెల్ మెస్సీ (1987 జననం) నేతృత్వంలో గెలుచుకున్నాడ‌ని అందులో లోబో అన్నారు.

ఇక క్రికెట్‌పై గురించి మాట్లాడుతూ.. 2019లో ఇంగ్లాండ్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ గెలిచినప్పుడు ఇయాన్ మోర్గాన్ (1986లో జన్మించాడు) కెప్టెన్‌గా ఉన్నాడని లోబో తెలిపాడు. 1987 సంవత్సరంలో జన్మించిన కెప్టెన్ 2023 క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుస్తాడని అతను ఊహించాడు. అయితే.. ఇక్క‌డ ఓ విష‌యాన్ని గ‌మ‌నించాలి. బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ సైతం 1987లోనే జ‌న్మించాడు. అయితే.. బంగ్లాదేశ్ అంత ప్ర‌మాద‌క‌రం కాదు అని అలా 1987లో పుట్టిన ఏకైక కెప్టెన్ అయిన రోహిత్ శర్మ మాత్రమే ప్రపంచకప్‌ను గెలుస్తాడు అని లోబో పేర్కొన్నాడు.

మ‌రీ లోబో అంచ‌నా వేసిన‌ట్లుగా వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 విజేత‌గా టీమ్ఇండియా నిలుస్తుందో లేదో మ‌రికొద్ది రోజుల్లో తేలిపోనుంది.

Asian Games 2023: ఆసియా క్రీడలు క్వార్టర్ ఫైనల్లో భారత్ జట్టు ఘన విజయం.. సెమీస్ లోకి ఎంట్రీ