Bernard Julien : వెస్టిండీస్ క్రికెట్‌లో తీవ్ర విషాదం.. మాజీ ఆల్‌రౌండర్ బెర్నార్డ్ జూలియన్ కన్నుమూత..
వెస్టిండీస్ మాజీ ఆల్‌రౌండర్ బెర్నార్డ్ జూలియన్ (Bernard Julien) కన్నుమూశాడు.

West Indies ex cricketer Bernard Julien passes away at 75
Bernard Julien : వెస్టిండీస్ క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మాజీ ఆల్‌రౌండర్ బెర్నార్డ్ జూలియన్ కన్నుమూశాడు. ఆయన వయసు 75 సంవత్సరాలు. ఉత్తర ట్రినిడాడ్‌లోని వల్సేన్ లో ఆయన తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యలు ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మరణం పట్ల పలువురు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు సంతాపం తెలియజేస్తున్నారు.
‘బెర్నార్డ్ జూలియన్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, వారి ప్రియమైన వారికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. ఈ కష్టకాలంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు మీకు అండగా ఉటుంది. వెస్టిండీస్ క్రికెట్‌కు ఆయన ఎంతో సేవ చేశారు. ఆయనకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాము.’ అని వెస్టిండీస్ క్రికెట్ అధ్యక్షుడు కిషోర్ షా తెలిపారు.
Hikaru Nakamura : గెలిచిన గర్వమా..! గుకేష్ ‘కింగ్’ను విసిరేశాడు.. ఇలా ఎందుకు చేశావని అడిగితే.. ?
1973లో ఇంగ్లాండ్ పర్యటనలో వెస్టిండీస్ తరుపున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగ్రేటం చేశారు బెర్నార్డ్ జూలియన్ (Bernard Julien). విండీస్ తరుపున 24 టెస్టులు, 12 వన్డేలు ఆడాడు. టెస్ట్‌ల్లో 866 పరుగులు చేయడంతో పాటు 50 వికెట్లు తీశాడు. వన్డేల్లో 86 పరుగులతో పాటు 18 వికెట్లు సాధించారు.
1975లో విండీస్ ప్రపంచకప్ గెలుపులో కీలక పాత్ర..
1975లో జరిగిన తొలి వన్డే ప్రపంచకప్‌ను వెస్టిండీస్ సొంతం చేసుకోవడంలో బెర్నార్డ్ జూలియన్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలోగ్రూప్ దశలో శ్రీలంకపై నాలుగు వికెట్లు, సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై మరో నాలుగు వికెట్లు పడగొట్టి జట్టును ఫైనల్‌కు చేర్చడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లోనూ 26 పరుగులు సాధించాడు.