లంచ్ బ్రేక్, టీ బ్రేక్ అంటారు.. అసలు అక్కడ క్రికెటర్లకి ఏం పెడతారు? వాళ్లు ఏం తింటారు?
క్రికెట్‌లో టెస్టులను సుదీర్ఘమైన ఫార్మాట్‌గా అభివర్ణిస్తారు.

What do cricketers eat and drink during breaks in Test cricket
క్రికెట్‌లో టెస్టులను సుదీర్ఘమైన ఫార్మాట్‌గా అభివర్ణిస్తారు. ఈ ఫార్మాట్‌లో ఫలితం తేలడానికి ఐదు రోజుల సమయం పడుతుంది. ప్రతి రోజు టెస్టులో మొత్తం మూడు సెషన్లు ఉంటాయి. టెస్టుల్లో రోజు మొత్తం ఆడాల్సి ఉంటుంది కాబట్టి ఆటగాళ్లకు నిర్దిష్ట వ్యవధిలో తగినంత విశ్రాంతి లభించే విధంగా ఈ సెషన్లను విభజించారు. అవే లంచ్, టీ బ్రేక్. మరి ఆటగాళ్లు లంచ్, టీ బ్రేకుల్లో ఏం తింటారు అన్న సంగతి చాలా మందికి తెలియదు.
ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ ఆటగాడు ఓలీ పోప్ ఆటగాళ్లు లంచ్, ట్రీ బేక్ విరామాల్లో ఏం తింటారో చెప్పేశాడు. ఆటగాళ్ల ఆహారపు అలవాట్లపై అది ఆధారపడి ఉంటుందన్నాడు. లంచ్‌లో సాధారణంగా చికెన్, చేపలు, పాస్తాతో స్టీక్ వంటివి తింటుంటారని స్కై స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ చెప్పాడు. ఇక తన విషయానికి వస్తే.. తాను బ్యాటింగ్ చేస్తుంటే మాత్రం పెద్దగా ఏం తినని చెప్పాడు. వీలైనంత వరకు లైట్ ఫుడ్ మాత్రమే తింటానని అన్నాడు. రోజంతా బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం ప్రొటీన్ షేక్, అరటి పండు తింటానని చెప్పాడు.
టెస్ట్ క్రికెట్‌లో ప్రత్యేకంగా బ్రిటిష్ భాగమైన సాంప్రదాయ ‘టీ బ్రేక్’ విషయానికి వస్తే.. ఇది ఎల్లప్పుడూ టీ తాగడం గురించి కాదని పోప్ అంగీకరించారు. ‘కొందరు టీ తాగడానికి ఇష్టపడతారు. నేను సాధారణంగా కాఫీ తాగుతాను. కొన్నిసార్లు.. వర్షం ఆలస్యం అయినప్పుడు లేదా ఎప్పుడైనా టీ తాగుతాను.’ అని పోప్ చెప్పాడు.
హెడింగ్లీ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఓలీ పోప్ (106) శతకంతో చెలరేగాడు. ఈ మ్యాచ్‌లో భారత్ పై ఇంగ్లాండ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తరువాతి ఇన్నింగ్స్‌ల్లో ఇబ్బంది పడ్డాడు. లార్డ్స్‌లో తొలి ఇన్నింగ్స్‌లో చేసిన 44 పరుగులే ఈ సిరీస్‌లో అతడి తదుపరి అత్యధిక స్కోరు కావడం గమనార్హం.
ENG vs IND : వీళ్లు డగౌట్‌కే పరిమితమా..? నీళ్ల బాటిళ్లు అందిస్తూనే ఉండాలా?
లార్డ్స్‌లో 22 పరుగుల తేడాతో ఉత్కంఠభరితమైన విజయం సాధించిన తర్వాత ఇంగ్లాండ్ ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది. జూలై 23 నుంచి 27 వరకు భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది.