BCCI : బీసీసీఐ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌తో లాభ‌మేంటి? ఇషాన్‌, అయ్య‌ర్‌లు కోల్పోయేది వీటినేనా?

భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2023-2024 సీజన్ కు సంబంధించి వార్షిక ప్లేయర్ కాంట్రాక్ట్‌లను ప్ర‌క‌టించింది.

BCCI : బీసీసీఐ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌తో లాభ‌మేంటి? ఇషాన్‌, అయ్య‌ర్‌లు కోల్పోయేది వీటినేనా?

Shreyas Iyer-Ishan Kishan

BCCI Central Contracts : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) 2023-2024 సీజన్ కు సంబంధించి వార్షిక ప్లేయర్ కాంట్రాక్ట్‌లను ప్ర‌క‌టించింది. ఈ సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌లో ఇషాన్‌ కిష‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ ల పేర్లు లేవు. వారిని సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌ల ప‌రిధిలోనికి తీసుకోలేద‌ని బీసీసీఐ తెలిపింది. వారిద్ద‌రు రంజీట్రోఫీలో ఆడ‌క‌పోవ‌డంతో ఆగ్ర‌హించిన బీసీసీఐ వారి కాంట్రాక్ట్‌ల‌ను పున‌రుద్ద‌రించ‌లేద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అస‌లు సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ఉంటే లాభం ఏంటి..? ఇషాన్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ లు ఏం కోల్పోనున్నారో ఇప్పుడు చూద్దాం..

సెంట్ర‌ల్ కాంట్రాక్ట్‌తో లాభ‌మేంటి?

సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ పొందిన ఆట‌గాళ్లు మాత్ర‌మే బీసీసీఐ అందించే అన్ని సౌక‌ర్యాల‌ను పొంద‌గ‌లుగుతారు. కాంట్రాక్ట్‌లో ఉన్న ఆట‌గాళ్ల‌కు వార్షిక వేత‌నం ల‌భిస్తుంది. ఎప్పుడైన క్రికెట‌ర్లు గాయ‌ప‌డితే వారు బెంగ‌ళూరులోని నేష‌న‌ల్ క్రికెట్ అకాడ‌మీ (ఎన్‌సీఏ)కి వెళ‌తారు. అక్క‌డ తిరిగి ఫిట్‌నెస్ సాధిస్తుంటారు. సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ఉన్న ఆట‌గాళ్ల‌కు మాత్ర‌మే అక్క‌డ అన్ని ఉచితంగా ల‌భిస్తాయి.

Ashwin : ధ‌ర్మ‌శాల‌లో సెంచ‌రీ కొట్ట‌బోతున్న అశ్విన్‌, బెయిర్ స్టో.. అరుదైన ఘ‌ట్టం

సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ఉన్న ఆట‌గాళ్లు ఇన్సురెన్స్ ఉంటుంది. ఉదాహ‌ర‌ణ‌కు దాదాపు 15 నెల‌ల క్రితం రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన రిష‌బ్ పంత్ చాలా కాలంగా ఎన్‌సీఏలోనే ఉంటున్నాడు. అత‌డికి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ఉండ‌డంతో అత‌డి వైద్య ఖ‌ర్చులు అన్ని బీసీసీఐనే భ‌రిస్తుంది. ప్ర‌స్తుతం గాయ‌ప‌డిన మ‌హ్మ‌ద్ షమీకి సైతం సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ఉండ‌డంతో అన్ని సౌక‌ర్యాల‌ను పొందుతున్నాడు. ఇత‌డి వైద్య ఖ‌ర్చుల‌న్నీ బీసీసీఐ భ‌రిస్తోంది.

ఇప్పుడు ఇషాన్ కిష‌న్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌లకు సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ లేక‌పోవ‌డంతో వీళ్లు డైరెక్ట్‌గా ఎన్‌సీఏలోకి వెళ్ల‌డం కుద‌ర‌దు. గాయాలైనా, రిహాబిటేష‌న్ కోసమైనా వీళ్లు ప్రాతినిథ్యం వ‌హించే స్టేట్ అసోసియేష‌న్ల నుంచి లేఖ‌లు తీసుకుని రావాల్సి ఉంటుంది. వీరు గాయ‌ప‌డితే సొంత ఖ‌ర్చుల‌తోనే వైద్యం చేయించుకోవాలి.

IND vs ENG 5th Test : ఐదో టెస్టుకు జ‌ట్టును ప్ర‌క‌టించిన బీసీసీఐ.. బుమ్రా ఇన్‌.. రాహుల్ ఔట్‌.. ఇంకా