ENG vs IND : భార‌త్‌, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌.. ఫ్రీగా మ్యాచ్‌ల‌ను ఎక్క‌డ చూడొచ్చొ తెలుసా?

మ‌రో రెండు రోజుల్లో భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది

Where will fans be able to watch IND vs ENG test series live for free

మ‌రో రెండు రోజుల్లో భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. జూన్ 20న తొలి టెస్టు మ్యాచ్ హెడింగ్లీలోని లీడ్స్ వేదిక‌గా ఆరంభం కానుంది. భార‌త కాల‌మానం ప్ర‌కారం మ‌ధ్యాహ్నం 3.30 గంట‌లకు మ్యాచ్ మొద‌లుకానుంది.

ఈ సిరీస్‌ను ఎక్క‌డ చూడొచ్చున‌ని క్రికెట్ ప్రేమికులు ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్ ప్ర‌సార హ‌క్కుల‌ను సోనీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ నెట్‌వ‌ర్క్ (కల్వర్ మాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్) ద‌క్కించుకుంది. టీవీ ప్ర‌సార హ‌క్కుల‌ను సోనీ ఉంచుకుని డిజిట‌ల్ హ‌క్కుల‌ను జియోకు ఇచ్చింది.

Mohammed Shami : ష‌మీ బిర్యానీ తింటుండ‌గా ఎగ‌తాళి చేసిన ర‌విశాస్త్రి.. క‌ట్ చేస్తే.. మ‌హాద్భుతం జ‌రిగింది..

దీంతో టీవీల్లో అయితే సోని స్ట్పోర్ట్స్ నెట్‌వ‌ర్క్‌లో మ్యాచ్‌లు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం కానున్నాయి. అదే ఫోన్‌లో అయితే జియో హాట్‌స్టార్ యాప్‌లో పాటు వైబ్‌సైట్‌లో మ్యాచ్‌లు స్ట్రీమింగ్ కానున్నాయి.

గుడ్‌న్యూస్‌..
కాగా.. ఈ సిరీస్‌కు ముందు క్రికెట్ అభిమానుల‌కు శుభ‌వార్త అందింది. భార‌త్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లోని మ్యాచ్‌లు అన్నింటిని డీడీ స్ట్పోర్ట్స్‌లో కూడా ప్ర‌త్య‌క్ష్య ప్ర‌సారం కానుంది. దీంతో ఈ ఛానెల్‌లో మ్యాచ్‌ల‌ను ఫ్రీగా చూడొచ్చు.

భార‌త్‌, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్ షెడ్యూల్ ఇదే..

తొలి టెస్టు – జూన్ 20 నుంచి జూన్‌ 24 వ‌ర‌కు – హెడింగ్లీ
రెండో టెస్టు – జూలై 2 నుంచి జూలై 6 వ‌ర‌కు – ఎడ్జ్‌బాస్టన్
మూడో టెస్టు – జూలై 10 నుంచి జూలై 14 వ‌ర‌కు – లార్డ్స్‌
నాలుగో టెస్టు – జూలై 24 నుంచి జూలై 27 వ‌ర‌కు – ఓల్డ్ ట్రాఫోర్డ్
ఐదో టెస్టు – జూలై 31 నుంచి ఆగ‌స్టు 4 వ‌ర‌కు – కెన్నింగ్టన్ ఓవల్

ENG vs IND : ర‌విశాస్త్రి ఇలా.. స‌బా క‌రీమ్ అలా.. టెస్టుల్లో కోహ్లీ స్థానంలో ఆడే ఆడ‌గాడి విష‌యంలో..

ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు భార‌త జ‌ట్టు ఇదే..
శుభ్‌మ‌న్ గిల్ (కెప్టెన్‌), రిష‌బ్ పంత్ (వైస్ కెప్టెన్‌), య‌శ‌స్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుద‌ర్శ‌న్‌, అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌, క‌రుణ్ నాయ‌ర్‌, నితీశ్‌కుమార్ రెడ్డి, ర‌వీంద్ర జ‌డేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), వాషింగ్ట‌న్ సుంద‌ర్, శార్దూల్ ఠాకూర్‌, జ‌స్‌ప్రీత్ బుమ్రా, మ‌హ్మ‌ద్ సిరాజ్‌, ప్ర‌సిద్ద్ కృష్ణ‌, ఆకాశ్ దీప్‌, అర్ష్‌దీప్ సింగ్‌, కుల్దీప్ యాద‌వ్